Jayamailini: అలనాటి అందాల తార సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. నిజం చెప్పాలంటే.. సిల్క్ జీవితం ఒక పువ్వు లాంటిది. అందు ఆ పువ్వుని చూసారు కానీ, దానికింద ఉన్న ముళ్ళును మాత్రం ఎవరు చూడలేకపోయారు. ఆ ముళ్ళమీద నడుస్తూనే ఆమె చిరునవ్వులు చిందించింది. ఎంతమంది హృదయాల్లో శృంగార తారగా కొలువుండిపోయింది. సిల్క్ జీవితం మొత్తం అందరికి తెల్సిందే. ఎన్నో ఆవమానాలు పడి, స్టార్ డమ్ ను తెచ్చుకుంది. చివరికి ఆ స్టార్ డమ్ వలనే ఆమె చనిపోయింది. ప్రేమ పేరుతో వంచించినవారు ఎక్కువే ఉన్నారు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కరు కూడా ఆమెకు తోడుగా లేరు. ప్రేమించడమే ఆమె చేసిన తప్పు అని ఆమె గురించి తెల్సినవారు చెప్తున్నారు. ఇక సిల్క్ గురించి తెలిసినవారిలో జయమాలిని ఒకరు. సిల్క్ రాకముందే.. జ్యోతిలక్ష్మీ, జయమాలిని అక్కాచెల్లెళ్లు.. ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు. శృంగార సన్నివేశాలు అయినా, సాంగ్స్ అయినా ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు లేకపోతే జరిగేవే కావు. ఇక వీరిద్దరూ టాలీవుడ్ ను ఏలుతున్న సమయంలో సిల్క్ ఎంటర్ అయ్యింది. తన అందచందాలతో అందరిని తన వైపుకు తిప్పుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకుంది. ఇక ఆమె మరణం గురించి జయమాలిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.
” ఇండస్ట్రీకి వచ్చిన కొన్నిరోజులకే ఎక్కువ పేరుతెచ్చుకున్న నటి అంటే సిల్క్ స్మిత అనే చెప్పాలి. షూటింగ్ సమయంలో ఆమె ఎప్పుడు నాతో మాట్లాడలేదు. ఒక సినిమాలో జ్యోతిలక్ష్మీ, నేను, సిల్క్ స్మిత కలిసి నటించాం. అప్పుడు కూడా తన పని తాను చూసుకొని వెళ్ళిపోయేది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరం. ప్రేమించడం వలనే సిల్క్ మృతి చెందింది. ప్రేమించడం తప్పు కాదు. కానీ, అందరి కన్నా ఎక్కువగా ప్రేమించడం తప్పు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు తోడుగా ఉన్నా కూడా ఇలాంటి ఘటన జరిగేది కాదు. ప్రేమించినవాడిని గుడ్డిగా నమ్మి.. ఆ ప్రేమకే ఆమె బలి అయ్యింది. సొంతవాళ్ళు పక్కన లేకపోతే మోసం చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.