YouTube Record: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTube Record: 2017లో విడుదలైన ‘జయ జానకి నాయక’ థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. అయితే అంచనాలను ఈ సినిమా ఏమాత్రం రీచ్ కాలేదు. కానీ డిజిటల్ ప్రపంచంలో మాత్రం ఈ సినిమా ఊహించని రీతిలో సంచలనం సృష్టించింది. ‘ఖూన్‌ఖార్’ పేరుతో హిందీలో డబ్ చేసిన ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో విడుదల చేయగా, నార్త్ ఆడియన్స్ విశేషంగా ఆదరించారు. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ , కమర్షియల్ ఎలిమెంట్స్ హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా వ్యూస్ క్రమంగా పెరుగుతూ రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ గా ‘ఖూన్‌ఖార్’ యూట్యూబ్‌లో ఏకంగా 1 బిలియన్ (100 కోట్ల) వ్యూస్ దాటింది. భారతీయ సినిమాలకు ఇది అత్యంత అరుదైన ఘనతగా చెప్పాలి. యూట్యూబ్‌లో ఈ స్థాయి వ్యూస్ సాధించిన తొలి భారతీయ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ రికార్డు మరోసారి హిందీ మార్కెట్లో డబ్ చేసిన దక్షిణాది సినిమాల ప్రభావాన్ని చాటిచెప్పింది. గత కొన్నేళ్లుగా డిజిటల్ వేదికల ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఉత్తరాదిలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ ప్రయాణంలో ‘ఖూన్‌ఖార్’ అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుకు కూడా ఇది ప్రత్యేకమైన మైలురాయి. థియేటర్లలో పెద్ద విజయం సాధించని సినిమా కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సత్తా చాటగలవని ‘జయ జానకి నాయక’ నిరూపించింది. విడుదలైన ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ప్రేక్షకుల ఆదరణతో కొత్త చరిత్ర సృష్టించడం ఈ సినిమా ప్రత్యేకతగా నిలిచింది.
Also Read
- Tags
- cinema
- Jaya Janaki Nayaka
తాజావార్తలు
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
-
Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!