కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రని పునాదులతో సహా పెకలిస్తుంది. ఇప్పటివరకూ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన ప్రతి రికార్డుని బ్రేక్ చేసి, కొత్త చరిత్రని రాస్తుంది జవాన్ సినిమా. సౌత్ లోనే వంద కోట్లు దాటింది అంటే జవాన్ కలెక్షన్స్ ఇక నార్త్ లో ఏ రేంజులో ఉన్నాయో ఊహించొచ్చు. షారుఖ్ ర్యాంపేజ్ కి 500 కోట్ల మార్క్ ని నాలుగు రోజుల్లోనే రీచ్ అయ్యింది జవాన్ సినిమా. నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తున్న షారుఖ్ వీక్ డేస్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ గా రాక్ సాలిడ్ గా నిలబడింది. ఫస్ట్ మండే జవాన్ సినిమా 30 కోట్ల నెట్ ని కలెక్ట్ చేసిన జవాన్, మంగళవారం బుధవారం కూడా బుకింగ్స్ లో జోష్ చూపించింది. ఇప్పుడు మళ్లీ వీకెండ్ మొదలయ్యింది కాబట్టి జవాన్ డే 7 కలెక్షన్స్ లో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయడం గ్యారెంటీ.
ఇప్పటివరకు ఓవరాల్ గా జవాన్ సినిమా కలెక్షన్స్ 700 కోట్లని దాటింది. ఏడు రోజుల్లో 700 కోట్లు రాబట్టిన ఏకైక బాలీవుడ్ సినిమాగా జవాన్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ వీకెండ్ తో ఫాస్టెస్ట్ 1000 క్రోర్ గ్రాసర్ గా జవాన్ సినిమా కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయనుంది. ఇక్కడితో పఠాన్ సినిమా రికార్డులు బ్రేక్ అయ్యి, ఈ ఇయర్ హయ్యెస్ట్ గ్రాసర్ గా జవాన్ నిలవనుంది. ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా షారుఖ్ నిలవనున్నాడు. ప్రతి హీరో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఏ స్టార్ హీరో కూడా ఒకే ఏడాదిలో రెండు సినిమాలని రిలీజ్ చేసే అవకాశం కనిపించట్లేదు కాబట్టి షారుఖ్ ఖాన్ లా ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలని ఇవ్వడం ఏ ఇండియన్ హీరోకీ అయ్యే పని కాదు.