సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “జటాధార”. రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ ఉన్న రహస్యాలు, పురాణ కథలు ఆధారంగా రూపొందినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ‘ఇది నిజ జీవిత సంఘటనల డాక్యుమెంటరీ కాదు. సినిమా కల్పిత కథ, ఫాంటసీ-థ్రిల్లర్ శైలిలో తెరకెక్కించ పడింది. సినిమా కథ ప్రధానంగా ఆలయం చుట్టూ దాగి ఉన్న రహస్యాలు, భక్తి, దురాశ, పవిత్రత మరియు శత్రుత్వం మధ్య జరిగే ఘర్షణల పై నిర్మించబడింది. ఆరవ ద్వారం, ఖజానాలు వంటి పురాణ కథలతో పాటు, దేవాలయ చుట్టూ ఉన్న రహస్యాలు సినిమాకు ప్రత్యేక వాతావరణాన్ని అందిస్తున్నాయి. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తూ, కథలో మంచి-చెడు పాత్రల మధ్య ఉత్కంఠను పుట్టించగా, విజువల్స్, సెట్ డిజైన్, ఆధ్యాత్మిక వాతావరణం సినిమాకు మరింత ఆకర్షణను చేకూరుస్తుంది’ అని సమాచారం.
Also Read : Karur rally : కరూర్ ర్యాలీ తొక్కిసలాటపై చిరంజీవి స్పందన..
స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణా అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తనికి “జటాధార” పూర్వపు ఆలయ ఇతిహాసాలు, రహస్యాలు, మరియు ఫాంటసీతో నింపిన థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు మరొక సరికొత్త అనుభవాన్ని అందించనుంది.