సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “జటాధార”. రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ ఉన్న రహస్యాలు, పురాణ కథలు ఆధారంగా రూపొందినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ‘ఇది నిజ జీవిత సంఘటనల డాక్యుమెంటరీ కాదు. సినిమా కల్పిత కథ, ఫాంటసీ-థ్రిల్లర్ శైలిలో తెరకెక్కించ పడింది. సినిమా కథ ప్రధానంగా ఆలయం చుట్టూ దాగి ఉన్న రహస్యాలు,…