Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా జాన్వీ కపూర్ తెలుగుతెరకు పరిచయమైంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఎంట్రీని చూడకుండానే శ్రీదేవి కన్నుమూసింది. తల్లి జ్ఞాపకాలతో జాన్వీ తనదైన రీతిలో ముందుకు కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం దేవర సినిమాతో జాన్వీ తెలుగుతెర మీద అడుగుపెట్టనుంది. ఎన్టీఆర్ సరసన నటిస్తుండడంతో అమ్మడిపై అంచనాలు పెరిగాయి. ఇక సోషల్ మీడియాలో ఈ భామ అరాచకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఈ భామ కుర్రకారును మత్తెక్కిస్తోంది. ఇక స్టార్ డాటర్స్ అంటే.. చిన్నతనం నుంచి వీరు ఏంజిల్స్ లా పెరుగుతారు. స్కూల్, కాలేజ్ లో కూడా వీరే హాట్ టాపిక్ గా మారతారు. ఇక ఎన్ని ప్రశంసలు దక్కుతాయో.. అన్నే విమర్శలు అందుకుంటారు. ఇక చిన్నతనంలో జాన్వీ ఎన్నో విమర్శలు అందుకున్నదని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. చిన్నతనంలో తనది, తన చెల్లి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల సైట్స్ లో పెట్టారని చెప్పుకొచ్చింది.
Shivanna: సిద్దార్థ్.. మమ్మల్ని క్షమించు.. ఇంకెప్పుడు ఇలా జరగదు
” చిన్నతనంలో మా ఫోటోలు మా అనుమతి లేకుండా మా ఫోటోలను తీసేవారు. మాకు ఇష్టం లేకుండా తీసినవి. వాటిని తీసుకెళ్లి కొంతమంది మార్ఫింగ్ చేసి.. అశ్లీల సైట్స్ లో పెట్టారు. వాటిని చూసి మేము చాలా బాధపడ్డాం. ఇప్పుడు .. ఈ మార్ఫింగ్ ఫోటోల బెడద మరింత ఎక్కువ అయ్యాయి. కానీ ప్రజలు ఇలా మార్ఫింగ్ చేసిన చిత్రాలు చూసి అవి వాస్తవమైనవని నమ్ముతున్నారు. అది నాకు చాలా ఆందోళనకు గురిచేసింది. నాకు పదేళ్లు ఉన్నప్పుడే నా ఫొటోలు యాహూ వెబ్ సైట్ లో దర్శనమిచ్చాయి. ఇక వాటిని చూసి నా ఫ్రెండ్స్ నన్ను హేళన చేసేవారు. సినిమాల్లోకి వెళ్ళిపోతావని, ఈజీగా హీరోయిన్ అయిపోతుందని చెప్పుకొచ్చేవారు. అవన్నీ నాకు చాలా చిరాకుగా అనిపించింది. అప్పట్లో నన్ను జడ్జ్ చేసేవాళ్ళు.. అసలు వాళ్లేందుకు అలా ప్రవర్తిస్తున్నారో అప్పుడు తెలిసేది కాదని” ఆమె చెప్పుకొచ్చింది. మరి దేవర సినిమాతో సినిమాతో ఈ బ్యూటీ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.