Shivanna:కన్నడ పరిశ్రమలో ప్రస్తుతం కావేరి నాదీ జలాలకు సంబంధించిన వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నేడు నిరసనకారులు బండ్ ప్రకటించారు. ఇక నిరసన కారులు.. నిన్నటికి నిన్న హీరో సిద్దార్థ్ ను అవమానించిన విషయం తెల్సిందే. సిద్దార్థ్ హీరోగా నటించిన చిత్తా సినిమా ప్రమోషన్స్ కోసం బెంగుళూరు వెళ్లగా.. ఆయన ప్రెస్ మీట్ ను నిరసనకారులు అడ్డుకున్నారు. ప్రెస్ మీట్ జరగడానికి వీల్లేదని చెప్పడంతో సిద్దూ .. నవ్వుతూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు. కేంద్ర ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకులను అడగలేక .. ఇలా కళాకారులను అవమానించడం ఆమోదయోగ్యం కాదని, సిద్దార్థ్ కన్నడిగులు తరుపున నేను సారీ చెప్తున్నా అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ఘటన మరింత వివాదాస్పదంగా మారింది. ఇక తాజగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సైతం సిద్దార్థ్ కు సారీ చెప్పాడు.
Samyukta Hegde: డ్యాన్స్ సరే.. బట్టలెక్కడ.. ?
కావేరీ నదీ జలాల కోసం పిలుపునిచ్చిన కర్ణాటక బంద్‌కు మద్దతుగా కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ సమావేశంలో శివన్న మాట్లాడుతూ.. ” మనం ఎప్పుడూ ఇతరుల మనోభావాలను ఏ విధంగానూ గాయపరచకూడదు. కన్నడ చిత్ర పరిశ్రమ తరుపున, సిద్ధార్థ్ మమ్మల్ని క్షమించు. అలా చేసిన వారు ఎవరో నాకు తెలియదు, కానీ మేము చాలా బాధపడ్డాము. ఇది ఎప్పటికీ పునరావృతం కాదు. కర్ణాటకలోని ప్రజలు అన్ని భాషల చిత్రాలను చూస్తున్నారు. అందరిని ఆదరిస్తున్నారు. కన్నడ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గౌరవం మరియు అభిమానాన్ని పొందారు. అన్ని రకాల ప్రజలు, భాషలు మరియు సంస్కృతులు పరస్పర గౌరవంతో ఉండే కర్ణాటక లాంటి ప్రదేశం మరొకటి లేదు. ప్రపంచవ్యాప్తంగా మనం సంపాదించుకున్న గౌరవాన్ని కాపాడుకోవాలి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.