Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రూ.135 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అయితే, చిత్ర యూనిట్ ఈ సక్సెస్ ఆనందంలో ఉండగానే.. ఒక సరికొత్త వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సరైన ప్రాధాన్యం దక్కలేదంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ వచ్చింది. అందులో.. ‘పెద్ది: భారతీయ సినిమా చరిత్రలో ఒక హీరోయిన్‌కు జరిగిన అత్యంత అవమానం’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను జాన్వీ కపూర్ లైక్ చేయడం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. పెద్ది సినిమాలో ‘అచ్చియమ్మ’ అనే పాత్రలో నటించింది జాన్వీ. అయితే, తన పాత్రకు ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తితోనే.. జాన్వీ ఆ నెగెటివ్ పోస్ట్‌ను లైక్ చేసినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, ఆమె పొరపాటున లైక్ బటన్ నొక్కి ఉంటుందని కూడా కొందరు భావించారు. అయితే, ఈ వ్యవహారం వివాదంగా మారుతోందని గ్రహించిన జాన్వీ, వెంటనే అప్రమత్తమై ఆ పోస్ట్‌ను అన్‌లైక్ చేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమె అన్‌లైక్ చేయడానికి ముందే నెటిజన్లు లైక్‌కు సంబంధించిన స్క్రీన్షాట్లను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. మరి నిజంగానే.. జాన్వీ తన పాత్ర విషయంలో హర్ట్ అయిందా? లేక అలా జరిగిపోయిందా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
తాజావార్తలు
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్‌కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్‌పై కీలక ప్రతిపాదన..
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!