అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తరచుగా తన వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తుంటుంది. జాన్వీ కపూర్ తాజాగా షేర్ చేసిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎక్స్ పెక్టేషన్ వర్సెస్ రియాలిటీని తనదైన శైలిలో చూపించింది. ఈ ఫన్నీ వీడియోలో ముందుగా ఆమె బికినీ టాప్ ధరించి సులభంగా మెషీన్ నుంచి ఆరెంజ్ జ్యూస్ ను తీస్తోంది. ఇది ఎక్స్ పెక్టేషన్… తరువాత నీలిరంగు టాప్, షార్ట్ ధరించి కన్పించింది. అయితే ఇందులో మాత్రం ఆమె ఆరెంజ్ జ్యూస్ ను తీయడానికి చాలా కష్టపడిపోయింది. ఈ వీడియోను ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో షేర్ చేస్తున్నారు.
Read Also : లక్ష్య : జగపతి బాబు లుక్ రివీల్
ఇక ఈ వారం ప్రారంభంలో జాన్వీ కపూర్ ఆమె కజిన్ రియా కపూర్ వివాహ వేడుకలో కనిపించింది. జాన్వీ కపూర్ మామ అనిల్ కపూర్ ఇంట్లో జరిగిన ఈ వేడుకల్లో సందడి చేసింది. రియా కపూర్ తన ప్రియుడు కరణ్ బూలానీని వివాహం చేసుకుంది.
“దఢక్” చిత్రంతో బాలీవుడ్ అరంగ్రేటం చేసిన జాన్వీ కపూర్ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చివరిసారిగా ‘రూహి’ చిత్రంలో కనిపించింది. ఈ చిత్రంలో ఆమెతో పాటు రాజ్ కుమార్ రావు, వరుణ్ శర్మ నటించారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘దోస్తానా 2’, ‘గుడ్ లక్ జెర్రీ’, ‘తఖ్త్’ వంటి చిత్రాలలో నటిస్తోంది.
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)