తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా మరియు చివరి చిత్రం జన నాయగన్. తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు. ఈ సినిమా. విజయ్ కెరీర్ లో 69వ గా రానున్న ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
Also Read : Anaswara : స్పీడు మీదున్న హీరోయిన్.. ఏకంగా 5 సినిమాలు రిలీజ్
నేడు విజయ్ బర్త్ డే కానుకగా ఈ సిసినిమా టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. అతి తక్కువ సమయంలోనే మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. కాగా టీజర్ తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు జననాయకుడు. విజయ్ చివరి కావడంతో తమిళ్ లో సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరుగుతాయానడంలో సందేహం లేదు. తమిళ్ లో సోలోగా దిగుతున్న విజయ్ కు తెలుగులో చిరు – అనిల్ రావిపూడి సినిమాతో పోటీ వస్తుంది. టాక్ బాగుంటే తెలుగులో తక్కువ అంచనా వేయలేం. మరి సంక్రాంతి ఫైట్ లో మెగాస్టార్ తో పోటీ పడుతున్న విజయ్ ఎటువంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.