సూపర్ స్టార్ రజినీకాంత్ ని కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్ సినిమా. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అసలు అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి 700 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో రోబో 2.0 తర్వాత జైలర్ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అనిరుద్ మ్యూజిక్, రజినీ వింటేజ్ స్వాగ్ అండ్ స్టైల్, నెల్సన్ మేకింగ్, శివన్న-మోహన్ లాల్ క్యామియో… జైలర్ సినిమాని మూవీ లవర్స్ సెలబ్రేట్ చేసుకునేలా చేసింది. రజినీపైన ఉన్న అభిమానంతో జైలర్ సినిమాలో నటించడానికి మోహన్ లాల్-శివ రాజ్ కుమార్ ఒప్పుకోని ఆడియన్స్ ని థ్రిల్ చేసారు. ఈ మలయాళ కన్నడ సూపర్ స్టార్ హీరోలు కనిపించేది కాసేపే అయినా క్లైమాక్స్ లో ఈ ముగ్గురికి సంబంధించిన సీన్ కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ముఖంగా క్లైమాక్స్ లో శివన్న ఎంట్రీ థియేటర్స్ లో పూనకాలతో ఊగిపోయారు.
సౌత్ ఇండియా మొత్తం 50 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన మొదటి తమిళ సినిమాగా చరిత్రకెక్కిన జైలర్ సినిమా, థియేటర్స్ లో ఇంకా సాలిడ్ కలెక్షన్స్ ఫుల్ చేస్తుండగానే మేకర్స్ ఈ మూవీని ఓటీటీలోకి తీసుకోని వచ్చేసి తప్పు చేసారు అనే కామెంట్స్ ని సన్ పిక్చర్స్ ఫేస్ చేసింది. అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన జైలర్ సినిమాకి ఓటీటీలో కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జైలర్ హిట్ అవ్వగానే జైలర్ 2 కోసం నెల్సన్ ని సన్ పిక్చర్స్ అడ్వాన్స్ ఇచ్చింది అనే మాట ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉంది. రజనీకాంత్ కి వంద కోట్లు, నెల్సన్ కి 50 కోట్ల అడ్వాన్స్ ని ఇప్పటికే ఇచ్చేసిన సన్ పిక్చర్స్… లోకేష్ కనగరాజ్-రజినీకాంత్ కాంబినేషన్ లో త్వరలో స్టార్ట్ అవ్వబోతున్న సినిమా కంప్లీట్ అవ్వగానే జైలర్ 2 స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయం బయటకి రావడంతో కోలీవుడ్ లో, సోషల్ మీడియాలో జైలర్ 2 హాట్ టాపిక్ అయ్యింది. మరి ఈ మచ్ అవైటెడ్ సీక్వెల్ విషయంలో సన్ పిక్చర్స్ నుంచి ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.