జగపతి బాబు.. ఒకప్పుడు ఫ్యామిలీ లేడీస్ కి దేవుడు అని చెప్పొచ్చు.. ఫ్యామిలీ హీరో అంటే టక్కున జగపతి బాబు పేరును తలుచుకునేవారు అంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఆ కాలంలో ఒక వెలుగు వెలిగిన జగ్గూభాయ్ ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారారు. చిన్నతనం నుంచి జగ్గూభాయ్ డబ్బుతోనే పెరిగాడు. ఆయన తండ్రి ఒక నిర్మాత.. ఆ తరువాత ఆయన సినిమా హీరోగా అయ్యాక ఆస్తిపాస్తులను రెట్టింపు చేసుకున్నాడు. అయితే ఏది శాశ్వతం కాదు అని అందరికి తెల్సిందే. కొన్నేళ్లు జగపతి బాబు కూడా కష్టాలు, నష్టాలు చవిచూశాడు. చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో తండ్రి కొన్న విల్లాను కూడా అమ్మేసి బతికిన రోజులు ఉన్నాయని ఆయనే స్వయంగా చెప్పారు.
ఇక తరువాత పడిలేచిన కెరటంలా విలన్ గా అవతారమెత్తారు.. వరుస హిట్లతో పోగొట్టుకున్న ఆస్తులన్నింటినీ తిరిగి సంపాదిస్తున్నాడు. తాజగా దుబాయ్ లో జగ్గూభాయ్ చేసిన షాపింగ్ యే ఇందుకు ఉదాహరణ.. దుబాయ్ సబర్బన్ ప్రాంతంలో షాపింగ్ చేసిన ఓ ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. చుట్టూ బ్రాండెడ్ షాపింగ్ కవర్స్ తో అలిసిపోయి కూర్చున్నాడు. ఇక దీనికి ఒక మంచి క్యాప్షన్ కూడా పెట్టారు. ‘డబ్బు లేకపోతే ఒక గోల… ఉంటే ఒక గోల’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. డబ్బు గురించి సీనియర్ హీరో వేదాంతం చెప్తున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.