Hyper Aadhi: కమెడియన్ హైపర్ ఆది అరెస్ట్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జబర్దస్త్ నటుడు, కమెడియన్ హైపర్ ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక షో జరుగుతుండగానే ఆ షోను ఆపి మరీ ఆదిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు.. ఉదయం షో కు వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని కారుతో గుద్ది పట్టించుకోకుండా వచ్చారని, ఆ అమ్మాయి ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఉందని తెలుపుతూ ఆదిని అరెస్ట్ చేస్తున్నామని స్టేజిపై రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇదంతా ప్రమోషన్ కోసం అని తెలియడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం హెయిర్ ఆది.. ప్రముఖ ఛానెల్ లో వచ్చే ఒక కామెడీ షోలో పాల్గొంటున్న విషయం విదితమే.. వారం వారం వచ్చే ఈ షోలో హైపర్ ఆది మెయిన్ కమెడియన్ అన్న సంగతి తెల్సిందే.
ఇక తాజాగా ఈ షో కు సంబంధించిన ప్రోమోను యాజమాన్యం రిలీజ్ చేసింది. ఇందులో మొదటి నుంచి వినోదాన్ని పంచిన ఆదికి ట్విస్ట్ ఇస్తున్నట్లు చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడం.. అతడిని అరెస్ట్ చేస్తున్నామంటూ గోల చేయడం లాంటివి చూపించి ఈ షో పై ఆసక్తి పెంచాలని ట్రై చేశారు. ఇక పోలీసులు గా వచ్చినవారు మరింత ఓవర్ యాక్షన్ చేయడం విశేషం.. అయితే ఇంత చేసినా ఈ ప్రాంక్ అభిమానులపై ఫలించలేదు.. ఎందుకంటే ఇక్కడే వారు ఒక లాజిక్ మిస్ అయ్యారు. అస్సలు హైపర్ ఆదికి కారు డ్రైవింగే రాదు.. ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు బాహాటంగానే చెప్పుకొచ్చాడు. మరి కారు డ్రైవింగ్ రాని ఆది కారు ఎలా నడిపాడు.. యాక్సిడెంట్ ఎలా చేశాడు..? ఇంత చిన్న లాజిక్ ను అభిమానులు పట్టుకోలేరా..? అని నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. మీ టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా చేస్తారా..? మొన్నటికి మొన్న ఇమ్మానుయేలు, పూర్ణను అసభ్యంగా తాకాడని ఆమె సీరియస్ అవ్వడం, స్టేజిపై కొట్టడం లాంటివి చూపించి రచ్చ చేశారు.. ఇక ఈ వారం ఇలా.. ఇదంతా మీ టీఆర్పీ రేటింగ్ ను పెంచుకోవడం కోసమేగా.. ఒక బ్రాండ్ ఉన్న ఛానెల్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం అస్సలు బాగోలేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్‌గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!