ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అభినవ్ కృష్ణ.. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన అభి ఆ తర్వాత బుల్లితెరపై డాన్స్ షో లో పాల్గొని విన్నర్ గా నిలిచాడు. ఇక జబర్దస్త్ కామెడీ షో తో అదిరే అభి గా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం ఒక పక్క బుల్లితెరపై వినోదాన్ని పంచుతూనే మరోపక్క చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక తాజాగా అభి నటిస్తున్న కొత్త చిత్రం సెట్ లో ప్రమాదం సంభవించింది.. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తుండగా అదిరే అభికి గాయాలు అయ్యినట్లు తెలుస్తోంది.
ఫైటర్ ను ఎదుర్కొనబోయి అభి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అతని కాళ్లు, చేతులకు గాయాలు అయ్యినట్లు సమాచారం. ముఖ్యంగా చేతికి తీవ్ర గాయం అయ్యిందని తెలుస్తోంది. ఆ చేతికి వైద్యులు 15 కుట్లు వేశారు. ప్రస్తుతం అభి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక ఈ విషయం తెలిసిన అదిరే అభి ఫ్యాన్స్.. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెరను ఏలేస్తున్న హైపర్ ఆదిని జబర్దస్త్ కు పరిచయం చేసింది అదిరే అభినే.. ఈ విషయం ఆది పలుమార్లు బాహాటంగానే వెల్లడిచేశాడు.