ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ “విక్రమ్”. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై . ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై అన్ని వర్గాల అభిమానులను ఆకర్షించింది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ క్రిష్ గంగాధరన్ ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు నటులు విజయ్ సేతుపతి, మలయాళ నటుడు భగత్ బాచ్ నటించారు. కమల్ హాసన్ కుమారుడిగా కాళిదాస్ జయరామ్ నటించారు. విజయ్ సేతుపతికి జోడిగా శివాని, మైనా నందిని నటించారు.
Read Also : సమంత, నాగచైతన్య మరోసారి పుట్టారు: ఆర్జీవీ
తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘విక్రమ్’ చిత్రీకరణ కొన్ని నెలల క్రితం చెన్నైలో అధికారికంగా ప్రారంభమైంది. ఆ తరువాత చిత్ర బృందం కారైకుడిలో షూటింగ్ కొనసాగించింది. తర్వాత పాండిచ్చేరిలో తదుపరి దశ చిత్రీకరణ ప్రారంభమైంది. తాజాగా పాండిచ్చేరిలో రెండో దశ చిత్రీకరణ పూర్తయినట్లు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రకటించారు. షూట్ మధ్యలో తీసిన ఫోటోను కూడా పంచుకున్నాడు. ఆ పిక్ లో లోకేష్ కనగరాజ్, క్రిస్ గంగాధరన్, అన్బరీవ్ సోదరులు కమల్ హాసన్ బైక్ మీద కూర్చొని ఉన్నారు.