Nithiin’s “Extraordinary Man” will be streaming from January 19th: నితిన్ హీరోగా నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ రివ్యూలు అందుకుంది. ఇక ఇప్పుడు “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్, రుచిరా ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించగా వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో రాజశేఖర్, రావు రమేష్, బ్రహ్మాజీ, సంపత్ రాజ్ వంటి వారు కనిపించారు.
Teja Sajja: ఆ ఒక్క షాట్ కోసం ఆరు నెలలు.. పొద్దున్న రోప్ ఎక్కితే మళ్ళీ సాయంత్రానికి దిగేవాడిని!
గత నెల 8వ తేదీన థియేటర్స్ లో రిలీజైంది ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా. జూనియర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన అభినయ్ అనే ఓ కుర్రాడు హీరోగా ఎదిగేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి హీరో అయ్యాడా? లేదా అనేది ఈ సినిమా కథ. కామెడీ, మంచి మ్యూజిక్, యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మరింత మంది ఆడియన్స్ కు ఈ సినిమా రీచ్ కానుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఈ సంక్రాంతికి ఇప్పటికే పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం కాగా ఇప్పుడు ఈ నితిన్ సినిమా కూడా రానుండడం గమనార్హం.