Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Teja Sajja Interview About Hanuman Movie

Teja Sajja: ఆ ఒక్క షాట్ కోసం ఆరు నెలలు.. పొద్దున్న రోప్ ఎక్కితే మళ్ళీ సాయంత్రానికి దిగేవాడిని!

Published Date :January 13, 2024 , 5:03 pm
By Bhargav Chaganti
Teja Sajja: ఆ ఒక్క షాట్ కోసం ఆరు నెలలు.. పొద్దున్న రోప్ ఎక్కితే మళ్ళీ సాయంత్రానికి దిగేవాడిని!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Teja sajja Interview about Hanuman Movie:  క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. . యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో హీరో తేజ సజ్జా విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

హను-మాన్ ఇంత గొప్ప విజయాన్ని అందుకోవడం ఎలా అనిపిస్తుంది ?
-చాలా ఆనందంగా వుంది. అన్నిచోట్ల నుంచి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులంతా చాలా గొప్ప ఆదరిస్తున్నారు. బయట భాషల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సర్ ప్రైజింగ్గా వుంది. నేను ఎవరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉంది. కానీ ఇతర భాషల వారికి నేనెవరో కూడా తెలీదు. ఇలాంటి వారి నుంచి వస్తున్న గొప్ప స్పందన చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంత ఎక్స్ ట్రార్డినరీ ఓపెనింగ్స్, నెంబర్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. హనుమాన్ నా కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది. ఈ విజయం ప్రేక్షకులందరిది. అందరూ గొప్పగా ఆదరించారు. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేదానికి హను-మాన్ నిదర్శనం. ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఏదో ఒక దైవశక్తి మమ్మల్ని నడుపుతుందని బలంగా నమ్ముతున్నాను.

Also Read

  • Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
  • NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
  • Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
  • Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు

హను-మాన్ విడుదలకు ముందు కాస్త ఒత్తిడి వాతావరణం కనిపించింది కదా ? అప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉండేవి ?
చివరి పది రోజులు అసలు ఒత్తిడి తీసుకోలేదు. ప్రతిది అనుకున్నట్లుగా జరుగుతుందని నమ్మకం పెట్టుకున్నాం. ఇప్పుడు థియేటర్స్ ప్రతి ఆటకి పెరుగుతున్నాయి. ఇది తప్పకుండా నాలుగు వారాలు పైగా రన్ వుండే చిత్రమని ముందు బలంగా నమ్మాం. ఈ వారం చూడని మరో వారం ఖచ్చితంగా చూస్తారని భావించాం.

నిర్మాత కె నిరంజన్ రెడ్డి గారి గురించి ?
మా నిర్మాత నిరంజన్ రెడ్డి మాపై చాలా నమ్మకం ఉంచారు. దర్శకుడు, నిర్మాత నమ్మకం చూసి నేను మరో చిత్రం కమిట్ అవ్వలేదు. ఈ మధ్యలో ఏదైనా చిత్రం చేస్తే దాని ప్రభావం ఎంతో కొంత హనుమాన్ పై పడే అవకాశం వుంది. అలాంటి అవకాశం లేకుండా బలంగా నమ్మి హనుమాన్ చేశాను. ప్రేక్షకులతో కలిసి ప్రిమియర్స్ చూశాను. వారి అద్భుతమైన స్పందన చూసి నా బరువంతా దిగిపోయినట్టు అనిపించింది. విజయాన్ని ఆస్వాదిస్తూనే సినిమాని ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ కు చేరువ చేయడానికి గురించి ఆలోచిస్తున్నాం. బెంగళూరు, చెన్నై, ముంబై వెళ్తున్నాం. యూస్ వెళ్ళే ఆలోచన కూడా వుంది.

షూటింగ్ సమయంలో మీరు మంచి ఇన్ పుట్ ఇచ్చారని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు ?
ఒక నటుడిగా లొకేషన్ లో నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే మొహమాటం లేకుండా చెబుతాను. నాకు అనిపించిందంటే ప్రేక్షకుడికి కూడా అనిపించే అవకాశం వుంది కదా. దర్శకుడు ప్రశాంత్ వర్మ గారు ఇన్పుట్ ఎవరు చెప్పినా వింటారు. అది ఆయన గొప్పతనం. అంతిమంగా సినిమా అద్భుతంగా రావడం అందరి లక్ష్యం. హనుమాన్ కి అందరం ఒక టీం వర్క్ గా పని చేశాం.

హను మాన్ యాక్షన్ స్టంట్స్ అన్నీ ఒరిజినల్ గా చేశారా ?
హను మాన్ అన్నీ ఒరిజినల్ గా చేసినవే. అండర్ వాటర్ సీక్వెన్స్, క్లైమాక్స్ లో గాల్లో వుండే సీక్వెన్స్ ఇవన్నీ రియల్ గా చేశాం. ఎయిర్ సీక్వెన్స్ లో పొద్దున్న మేకప్ వేసుకుని రోప్ ఎక్కితే మళ్ళీ సాయంత్రానికి దిగేవాడిని.

హనుమాన్ లో బ్రదర్ సిస్టర్ ఎమోషన్ బాగా పండింది ? వరలక్ష్మీ శరత్ కుమార్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
వరలక్ష్మీ శరత్ కుమార్ గారు గ్రేట్ యాక్టర్. పెద్ద యాక్టర్ తో వర్క్ చేస్తున్నప్పుడు నేర్చుకునే అవకాశం ఉంటుంది. పరస్పర సహకారంతో సన్నివేశాలన్నీ చక్కగా వచ్చాయి.

ఇందులో హనుమాన్ విగ్రహం చూసినప్పుడల్లా చాలా దివ్యమైన అనుభూతి కలిగింది.. అది చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ?
-ఆ ఒక్క షాట్ కోసం ఆరు నెలలు పట్టింది.

హనుమాన్ గా చిరంజీవి గారు కనిపిస్తారేమో చాలా మంది భావించారు ? మీరు సంప్రదించారా ?
చిరంజీవి గారికి హనుమాన్ ప్రాజెక్ట్ గురించి తెలుసు. మా ఉద్దేశం కూడా చిరంజీవి గారికి తెలుసు.(నవ్వుతూ) హనుమాన్ విషయంలో చిరంజీవి గారు చాలా ఆనందంగా వున్నారు. 12 తేదీ ‘కంగ్రాట్స్ మై బాయ్. సో ప్రౌడ్ ఆఫ్ యు ’ అని అభినందనలు తెలుపుతూ నాకు మెసేజ్ పెట్టారు.

హరి గౌర నేపధ్య సంగీతానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది ? థియేటర్ లో చూసినప్పుడు ఏం అనిపించింది ?
ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ అండీ. కొన్ని సీన్స్ చూస్తూ డివైన్ ట్రాన్స్ లోకి వెళ్తున్నారు ఆడియన్స్. హనుమాన్ సినిమా మేము చేశామని అనుకోవడం లేదు హనుమాన్ మాకు జరిగింది.

హను మాన్ జర్నీలో మీరు నేర్చుకున్నది ?
ఓపికగా ఉండటం నేర్చుకున్నాను.

కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?
ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. తర్వలోనే అనౌన్స్ చేస్తా.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Teja sajja Interview
  • Teja sajja Interview News

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions