King100: హీరోయిన్గా కాదు.. విలన్ గా టబు? నాగార్జున 100వ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King100: అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో నాగార్జున 100వ చిత్రం ‘కింగ్100’ ఒకటి. ఈ ప్రతిష్టాత్మక సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా వినిపిస్తున్న ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో సూపర్ హిట్ చిత్రాల్లో నాగార్జునతో జతకట్టిన టబు, ఈ సినిమాలో హీరోయిన్గా కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న నాగార్జున, తన 100వ సినిమా గురించి అభిమానులకు కీలక హామీ కూడా ఇచ్చారు. జూలై 10 తర్వాత ‘కింగ్100’కు సంబంధించిన అప్డేట్ ఇస్తానని ఆయన వెల్లడించారు. దీంతో ఈ సినిమా గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. అదే సమయంలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా ఇండస్ట్రీ బజ్ ప్రకారం, ఈ చిత్రంలో టబు విలన్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. నాగార్జున, టబు కాంబినేషన్‌కు ప్రత్యేక అభిమాన వర్గం ఉండటంతో, వీరిద్దరూ మరోసారి రొమాంటిక్ జంటగా కనిపిస్తారని చాలామంది భావించారు. కానీ ఇప్పుడు విలన్ పాత్రలో టబు కనిపించవచ్చనే వార్త ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్100’ పేదరికం నుంచి సంపన్నుడిగా ఎదిగిన ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ కథలో తండ్రీకూతుళ్ల మధ్య సాగే ఎమోషన్స్ హైలెట్ గా నిలవనున్నాయని ప్రచారం జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో సుష్మిత భట్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read
- Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
- Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
ప్రస్తుతం ‘కింగ్100’ షూటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో, జూలై 10 తర్వాత నాగార్జున ప్రకటించబోయే అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా టబు పాత్రపై వస్తున్న వార్తల్లో నిజమెంత? ఆమె నిజంగానే ప్రతినాయకురాలిగా కనిపిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అప్పటి వరకు ఈ వార్తలను కేవలం ఇండస్ట్రీ బజ్‌గా మాత్రమే చూడాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!