95వ ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకునే లిస్టులో ఎవరు ఉండబోతున్నారు? ఆ ప్రెస్టీజియస్ అవార్డుని ఎవరు గెలుచుకోబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు సాయంత్రం 7 గంటలకి అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యనున్నారు. అకాడెమీకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో లైవ్ స్ట్రీమ్ అవ్వనున్న ఈ ఆస్కార్ అవార్డ్స్ ఫైనల్ నామినేషన్స్ కోసం ఇండియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేసులో ఉండడంతో ఇండియన్ మూవీ లవర్స్ లో ఆస్కార్ నామినేషన్స్ పై ఆసక్తి నెలకొంది.
బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో ఎదో ఒక కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ ని నామినేట్ అవుతుందని, బెస్ట్ సాంగ్ కి ఏకంగా ఆస్కార్ అవార్డ్ గెలుస్తుందని అందరూ నమ్మకంతో ఉన్నారు. అసలు ఇండియన్ సినీ అభిమానులకి ఆస్కార్ ఆలోచన కలిగించిన మొదటి వ్యక్తి ‘ఎన్టీఆర్’. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమునిగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు, అతను బెస్ట్ యాక్టర్ కేటగిరిలో ఆస్కార్ బరిలో నిలుస్తాడని వెరైటీ మ్యాగజిన్ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఇక్కడి నుంచి ఇండియన్ మూవీ లవర్స్ దృష్టి ఆస్కార్స్ పై పడింది. వెస్ట్రన్ సినీ అభిమానులని కాక అక్కడి ఫిల్మ్ మేకర్స్ అండ్ క్రిటిక్స్ ని కూడా తన నటనతో మెప్పించిన ఎన్టీఆర్ ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ లో ఉంటాడు అని ఇతర మ్యాగజైన్స్ కూడా ప్రిడిక్షన్స్ రాసాయి. దీంతో ఎన్టీఆర్ ఆస్కార్ తెస్తాడు అనే నమ్మకం చాలా మందిలో కలిగింది.
ఎన్టీఆర్ ఆస్కార్ గెలుస్తాడు అనుకోవడం అత్యాశే అయినా కనీసం నామినేట్ అయినా అవుతాడని నందమూరి అభిమానులు నమ్మకంతో ఉన్నారు. #NTRforOscars అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నాని నటించిన జెర్సీ సినిమాలోని “ఈరోజు సాయంత్రం ఏం జరిగినా, ఐ యామ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యు నా దృష్టిలో బెస్ట్ ప్లేయర్ మాత్రం నువ్వే” అని సత్యరాజ్ చెప్పే డైలాగ్ ని కాస్త చేంజ్ చేసి… “ఈరోజు సాయంత్రం ఆస్కార్ నామినేషన్స్ లో నువ్వు ఉన్నా లేకున్నా మా దృష్టిలో బెస్ట్ యాక్టర్ మాత్రం నువ్వే” అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆస్కార్ తెస్తాడు, ఎన్టీఆర్ నామినేషన్స్ లో ఉంటాడు అనే విషయాలు పక్కన పెడితే ఒక ఇండియన్ యాక్టర్ కి ఈ స్థాయిలో గుర్తింపు రావడం నిజంగా గొప్ప విషయమే. అందుకే ఈరోజు సాయంత్రం ఏం జరిగినా, వీ ఆర్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యు. మా దృష్టిలో బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ మాత్రమే అని నందమూరి అభిమానులు అంటున్న మాటలో నిజముంది.