ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2 సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేసింది యష్ రాజ్ ఫిల్మ్స్. YRF స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఆరో సినిమాగా అనౌన్స్ అయిన వార్ 2 కాస్టింగ్ ఎన్టీఆర్ లిస్టులో ఎన్టీఆర్ చేరడంతో సడన్ గా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కబీర్ సింగ్ గా హ్రితిక్ రోషన్, అతనికి అపోజిట్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అనగానే ఇండియా మొత్తం ఒక్కసారిగా వార్ 2 వైపు తిరిగి చూసింది. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర 2 సినిమాని హోల్డ్ చేసి మరీ వార్ 2 సినిమా చేస్తున్నాడు అంటే ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవలే స్పైయిన్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన వార్ 2 సినిమా సెట్స్ లో ఎన్టీఆర్ ఇంకా జాయిన్ అవ్వలేదు. ఎన్టీఆర్ లేని హ్రితిక్ సీన్స్ ని చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి నుంచి ఎన్టీఆర్ కూడా వార్ 2 సెట్స్ లో జాయిన్ అవ్వనున్నాడు.
అనౌన్స్మెంట్ తోనే బజ్ జనరేట్ చేసిన ఈ మూవీని 2025 ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నారు. వార్ 2కి నాలుగు రోజుల వీకెండ్ దొరికింది… సరిగ్గా టాక్ బయటకు వస్తే ఈ సినిమా దెబ్బకి బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు భూస్థాపితం అవుతాయి. ఇప్పటివరకూ సౌత్ సినిమాలు నార్త్ బాక్సాఫీస్ ని కబ్జా చేసాయి కానీ ఇప్పుడు మొదటిసారి ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి వార్ 2 సినిమా సౌత్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. హ్రితిక్ కెరీర్ అండ్ ఎన్టీఆర్ కెరీర్ లో మాత్రమే కాదు యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ కే బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలవడం గ్యారెంటీ. ఎన్టీఆర్-హ్రితిక్ లకి ఇక షారుఖ్ అండ్ సల్మాన్ క్యామియో కూడా కలిస్తే బాక్సాఫీస్ కలెక్షన్స్ ని ఊహించడం కూడా కష్టమే.