NTR: టీం ఇండియా ఆటగాళ్లతో యంగ్ టైగర్ ఎన్టీఆర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రిస్మస్ సమయంలో ఫారిన్ వెళ్లాడు. అప్పటి నుంచి ఫ్యామిలీతో పాటు అమెరికాలో టైం స్పెండ్ చేస్తున్నాడు ఎన్టీఆర్. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లాస్ ఏంజిల్స్ లోనే సెలబ్రేట్ చేసుకున్న ఎన్టీఆర్, ఇటివలే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ కి రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణిలతో కలిసి అటెండ్ అయ్యాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకోవడంతో, ఇంటర్నేషనల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ హాట్ టాపిక్ అయ్యింది. దీంతో చరణ్, ఎన్టీఆర్ లు వెస్ట్రన్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్ లో మార్వెల్ సినిమాలో ఛాన్స్ గురించి మాట్లాడిన ఎన్టీఆర్, “వన్ కాల్ అవే” అని చెప్పాడు. ఈ మాట సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ ‘బ్లాక్ పాంథర్’ క్యారెక్టర్ లో నటిస్తే బాగుంటుందనే కామెంట్స్ వినిపించాయి.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ కంప్లీట్ అవ్వడంతో ఎన్టీఆర్ ఇండియాకి తిరిగొచ్చాడు. ఎక్కడ కలిసారు అనే విషయంలో క్లారిటీ లేదు కానీ ఎన్టీఆర్ ఇండియా తిరిగొచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఇండియన్ స్టార్ క్రికెటర్స్ తో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖరీదైన కార్ కలెక్షన్స్ తో ఆకట్టుకున్న హైదరాబాద్ వాసి ‘నజీర్ ఖాన్’ కు టీం ఇండియా ప్లేయర్స్ లో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్, ‘నజీర్ ఖాన్’ ఇంటికి వచ్చిన సమయంలో ఇండియన్ క్రికెట్ స్టార్ ప్లేయర్స్ ఫోటో దిగారు. ఈ ఫోటోలో సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, యుజివిందర్ చాహల్, శార్దుల్, శుభమాన్ గిల్ లు ఉన్నారు. ఎన్టీఆర్ వైట్ టీషర్ట్ లో ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఫోటోల్లో కాస్త క్లారిటీ మిస్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫాన్స్, HD ఫోటోస్ ని పోస్ట్ చెయ్యండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఎన్టీఆర్ షూటింగ్ మోడ్ లోకి ఎప్పుడు తిరిగి వస్తాడు? ఎన్టీఆర్ 30 పనులు ఎప్పుడు మొదలుపెడతాడు? రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుంచి జరుగుతుంది అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది?
Also Read
తాజావార్తలు
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!