రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా… సన్నీ డియోల్ నటించిన గదర్ 2 సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ కళకళలాడేలా చేసాయి. ఈ రెండు సినిమాలు దాదాపు 1110 కోట్లు రాబట్టి నార్త్ అండ్ సౌత్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. దీంతో సినిమా బిజినెస్ చేసే అన్ని వర్గాలు ఆగస్టు నెలని గోల్డెన్ పీరియడ్ గా చూస్తున్నారు. అయితే ఇది జస్ట్ శాంపిల్ మాత్రం రాబోయే నెల రోజుల్లో ఇండియన్ సినిమా ముందెన్నడూ చూడని ఒక మాస్ హిస్టీరియాని, కలెక్షన్ల సునామీని చూడబోతుంది. ఈ కలెక్షన్ల కార్నివాల్ ని సరిగ్గా పది రోజుల్లో మొదలుపెడుతూ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్న జవాన్ సినిమాపై ఉన్న హైప్ అండ్ పఠాన్ సినిమా కలెక్షన్స్ తో జోష్ లోకి వచ్చిన షారుఖ్ ఫ్యాన్స్ ని అనలైజ్ చేసి చూస్తే జవాన్ మూవీ ఈజీగా వెయ్యి కోట్లు దాటడం గ్యారెంటీ. పఠాన్ సినిమాతో కేవలం నార్త్ అండ్ ఓవర్సీస్ మార్కెట్ తో మాత్రమే వెయ్యి కోట్లని రాబట్టిన షారుఖ్ కి ఇప్పుడు అట్లీ వలన సౌత్ మార్కెట్ కూడా కలిసి రాబోతుంది. సో జవాన్ కౌంట్ వెయ్యి నుంచి మొదలై 1500 కోట్ల వరకూ వచ్చి ఆగొచ్చు అనేది బాలీవుడ్ ట్రేడ్ వర్గాల ప్రిడిక్షన్.
కింగ్ ఖాన్ జవాన్ కాస్త స్లో అవ్వగానే ఇండియన్ బాక్సాఫీస్ పై దాడి చేయడానికి ప్రభాస్ డైనోసర్ లా దిగుతున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సీజ్ ఫైర్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అవనుంది. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమాపై లేనంత హైప్ సలార్ సినిమాపై ఉంది. ప్రభాస్ తనకి కంచు కోట లాంటి కమర్షియల్ సినిమా చేయడం, KGF తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ తెరకెక్కించడం, ఈ సినిమాపై అంచనాలకి కారణం అయ్యింది. ఫ్లాప్ సినిమాతో కూడా అయిదు వందల కోట్లు రాబట్టే ప్రభాస్, సలార్ సినిమా ఫ్లాప్ అయినా వెయ్యి కోట్లని రాబట్టడం గ్యారెంటీ. ఒకసారి హిట్ అనే టాక్ వినిపిస్తే చాలు సలార్ ర్యాంపేజ్ దెబ్బకి షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డులు కూడా ఎగిరిపోవడం ఖాయం. ఈ రెండు సినిమాలు కేవలం మూడు వారాల గ్యాప్ లోనే రిలీజ్ అయ్యి దాదాపు 2500 కోట్ల మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాయి. సో రిజల్ట్ తో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచనలం నమోదు కాబోతుంది.
ఇక సెప్టెంబర్ కంప్లీట్ అవ్వగానే అక్టోబర్ లో లియో సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటడానికి రెడీగా ఉంది. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల కాంబినేషన్ లో అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ మూవీ కోలీవుడ్ లో మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకుంది. విక్రమ్ సినిమాతో కమల్ కి 500 కోట్ల సినిమా ఇచ్చిన లోకేష్ కనగరాజ్, ఈసారి విజయ్ తో అంతకు మించి హిట్ కొట్టే ప్రయత్నమే చేస్తాడు కాబట్టి లియో సినిమా కలెక్షన్స్ కూడా సాలిడ్ ఉండే అవకాశం ఉంది. జైలర్ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేయాలని విజయ్ ఫ్యాన్స్ కసిగా ఉన్నారు. ఇది జరగాలి అంటే లియో మూవీ దాదాపు 600 కోట్లకి పైన రాబట్టాలి. ఒకవేళ లియో 600 కోట్లు రాబడితే ఇండియన్ సినిమా కేవలం 45 రోజుల్లో (ఈ గ్యాప్ లో వ్యాక్సిన్ వార్, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వర రావు, ఘోస్ట్ సినిమాలు కూడా భారీ హైప్ తో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ కలెక్షన్స్ ని కూడా కలిపితే) దాదాపు 3000-3500 కోట్ల మార్కెట్ ని టచ్ చేసినట్లు అవుతుంది. అది నిజంగా ఇండియన్ సినిమాకి గోల్డెన్ పీరియడ్ లాంటిదే. మరి చూడాలి సెప్టెంబర్ 7న షారుఖ్ ఖాన్ ఈ కలెక్షన్ల కార్నివాల్ కి ఎలాంటి స్టార్ట్ ఇస్తాడో.