Indian 2 Releasae Month Announced: భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ‘ఇండియన్ 2’.. సినిమా తెరకెక్కుతుంది.. అప్పట్లో శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలం తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. ఒక పెను ప్రమాదం వల్ల నిలిచిపోయిన ఈ సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. శంకర్ చొరవతో ఈ సినిమాను మళ్లీ సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. కమల్ హాసన్ ఎన్నో ఏళ్ల తర్వాత ‘విక్రమ్’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫామ్ లోకి వచ్చాక ఆ ఫామ్ లోనే ఇగ ఆగిపోయింది అనుకున్న ఇండియన్ 2 సినిమా స్టార్ట్ చేసారు. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.
Priyanka Gandhi: ఈవీఎంలపై ప్రజలకు నమ్మకం లేదు..
ఈ సినిమా ను లైకా ప్రొడక్షన్స్ కొన్ని వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల గురించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ తాజాగా ఈ సినిమా విడుదల పై ఒక అప్డేట్ ఇచ్చింది సినిమా యూనిట్. అదేమంటే ఈ సినిమాను జూన్ నెలలో రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించింది. అంటే ఇంకా రెండే నెలల సమయం ఉంది. దీంతో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టె అవకాశం ఉంది. నెల ఏదో ప్రకటించింది కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు.
దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే.. తెల్లటి ధోతి, కుర్తాలో కమల్ హాసన్ కనిపిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అంటే ఎంత స్వచ్చంగా ఉండాలో అంతటి స్వచ్చత పోస్టర్‌ను ప్రస్పుటంగా కనిపిస్తోంది. జీరో టాలరెన్స్ (తప్పును అస్సలు భరించలేను) అని పోస్టర్‌పై ఉన్న లైన్ చాలా ప్రభావవంతంగా ఉంది. ఇక కమల్ హాసన్ కూడా సీరియస్, ఇన్‌టెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. అలాగే మనదేశాన్ని అవినీతి క్యాన్సర్‌లా పట్టి పీడిస్తోంది. ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా ఈ పోస్టర్‌తో వివరించే ప్రయత్నం చేశారు. ధూమపానానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనల నుంచి ప్రేరణతో ఈ పోస్టర్‌ను తయారు చేశారు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీకర ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్ గా వర్క్ చేస్తున్నారు. బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణకుమార్‌లతో కలిసి డైరెక్టర్ శంకర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.
Gear up for the comeback of Senapathy!🤞INDIAN-2 🇮🇳 is all set to storm in cinemas this JUNE. Mark your calendar for the epic saga! 🫡🔥#Indian2 🇮🇳
🌟 #Ulaganayagan @ikamalhaasan
🎬 @shankarshanmugh
🎶 @anirudhofficial
📽️ @dop_ravivarman
✂️🎞️ @sreekar_prasad
🛠️ @muthurajthangvl… pic.twitter.com/kwiKyAcNta— Lyca Productions (@LycaProductions) April 6, 2024