Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Independence Day Special: ఆగస్టు 15 అంటే ప్రతి భారతీయుడికీ ప్రత్యేకమైన రోజు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ జాతీయ జెండాను ఎగురవేసే రోజు మాత్రమే కాదు.. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఎందరో వీరుల కథలను మరోసారి గుర్తు చేసుకునే రోజు. ఈ సందర్భంలో దేశభక్తిని మరింతగా ఫీల్ అవ్వాలంటే సినిమాలు కూడా మంచి మార్గమే. భారత సైనికుల త్యాగం నుంచి దేశం కోసం పోరాడిన సామాన్యుల ధైర్యం వరకు ఎన్నో కథలు ప్రేక్షకులను కదిలించాయి. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూడటానికి కొన్ని సినిమాలను బెస్ట్ సజేషన్ గా చెప్పుకోవచ్చు. వీటిని చూస్తే దేశభక్తి ఫీల్ పక్కా వస్తుంది. వీటిని ఎక్కడ చూడచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజా (Roja)
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోజా’ ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. అరవింద్ స్వామి, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేమకథతో మొదలై ఉగ్రవాదం, దేశభక్తి నేపథ్యంలో ఆసక్తికరంగా సాగుతుంది. తన భర్త ఉగ్రవాదుల చేతిలో చిక్కుకున్నప్పుడు ఒక మహిళ ఎదుర్కొనే పరిస్థితులు, అతడిని కాపాడేందుకు చేసే ప్రయత్నాలు సినిమాలో హైలెట్ గా కనిపిస్తాయి. దేశం కోసం పనిచేసే వ్యక్తి ఎదుర్కొనే ప్రమాదాలను ఈ సినిమా చాలా అద్భుతంగా చూపిస్తుంది. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా తప్పక గుర్తుచేసుకోవాల్సిన సినిమాల్లో ‘రోజా’ ఒకటి. అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, సన్ నెక్స్ట్ ఓటీటీలలో ఈ మూవీని చూసేయచ్చు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
మేజర్ (Major)
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా దేశభక్తి కథల్లో ప్రత్యేకంగా నిలిచింది. అడివి శేష్ టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమాకి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చూపించిన ధైర్యాన్ని ఈ సినిమాలో చూపించారు. అయితే కేవలం యాక్షన్ సన్నివేశాలకే పరిమితం కాకుండా ఆయన బాల్యం, ఫ్యామిలీ, వ్యక్తిగత జీవితం, దేశం కోసం తీసుకున్న నిర్ణయాలను కూడా కథలో చూపించారు. ఒక సైనికుడి త్యాగం వెనుక అతని కుటుంబం ఎంతటి బాధను భరిస్తుందో తెలియజేసే సినిమా ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
షేర్షా (Shershaah)
కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితాన్ని ఆధారంగా తెరకెక్కిన షేర్షా మరో అద్భుతమైన దేశభక్తి సినిమా. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో కార్గిల్ యుద్ధ సమయంలో విక్రమ్ బాత్రా చూపించిన ధైర్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. వార్ సన్నివేశాలతో పాటు విక్రమ్ వ్యక్తిగత జీవితం, ప్రేమ, స్నేహం వంటి ఎమోషన్స్ ను కూడా కథలో చూపించారు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు వెళ్లిన సైనికుడి కథ కావడంతో ఈ సినిమా చూసినప్పుడు దేశభక్తి ఫీలింగ్ పీక్స్ కి వెళ్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఉరి: ది సర్జికల్ (Uri: The Surgical Strike)
2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో తెరకెక్కిన ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ సినిమా ప్రేక్షకుల్లో భారీ స్పందన తెచ్చుకుంది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. భారత సైనికులపై జరిగిన ఉగ్రదాడికి రివేంజ్ గా చేపట్టిన సర్జికల్ స్ట్రైక్‌ను ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. దేశభక్తితో పాటు ఇంటెన్స్ యాక్షన్‌ను ఆస్వాదించాలనుకునేవారికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్. జీ5లో ఈ సినిమాను చూసేయచ్చు.
కేసరి (Kesari)
కేసరి కూడా ఇండిపెండెన్స్ డే లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 1897లో జరిగిన సారాగఢి యుద్ధం నేపథ్యంలో 21 మంది సిక్కు సైనికులు వేలాది మంది శత్రు సైనికులను ఎదుర్కొన్న వీరగాథను చూపిస్తుంది. దేశభక్తి, ధైర్యం, త్యాగం ప్రధానంగా సాగే ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ ఐదు సినిమాల్లో ఏదైనా ఒకటి చూసినా దేశం కోసం పోరాడిన వీరుల త్యాగాలను మరోసారి గుర్తుచేసుకోవచ్చు. ఈ ఆగస్టు 15న కుటుంబంతో కలిసి ఈ సినిమాల్లో మీకు నచ్చినదాన్ని ఎంచుకుని చూడండి. సినిమా పూర్తయ్యే సమయానికి దేశం పట్ల గర్వం మరింత పెరగడం ఖాయం.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..