NTR: ఆ విషయంలో యంగ్ టైగర్ అటా? ఇటా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR:పలు విషయాల్లో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న జూనియర్ యన్టీఆర్ ఓ విషయంలో మాత్రం ఆ మాట నిలుపుకోలేక పోతున్నారు. బహుపాత్రలు ధరించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న నటరత్న యన్టీఆర్ మనవడైన జూనియర్ యన్టీఆర్ మాత్రం ఆ విషయంలో బాగా వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు ఈ సంగతి ఎందుకు గుర్తు చేసుకోవలసి వచ్చిందంటే జూనియర్ తాజా చిత్రంలో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. తెలుగు చిత్రసీమలో నటరత్న కంటే ముందు పలువురు ద్విపాత్రాభినయం చేసి అలరించారు. అయితే యన్టీఆర్ ‘రాముడు-భీముడు’ విడుదలయ్యాకే డ్యుయల్ రోల్ కు ఓ క్రేజ్ ఏర్పడింది. ఇక ఆయన ట్రిపుల్ రోల్ చేశాకే తెలుగునాట త్రిపాత్రాభినయాలకు ఊపొచ్చింది. ఇక ద్విపాత్రాభినయాల్లో యన్టీఆర్ తెలుగుసినిమా రంగంలో రికార్డు సృష్టించారు. అత్యధిక డ్యుయల్ రోల్ మూవీస్ లో నటించిన ఘనత నటరత్న సొంతం. అంతేకాదు, తండ్రీకొడుకులుగా నటించి వరుసగా మూడేళ్ళు బ్లాక్ బస్టర్స్ చూసిన ఘనత కూడా యన్టీఆర్ కే దక్కింది. 1980లో ‘సర్దార్ పాపారాయుడు’, 1981లో ‘కొండవీటి సింహం’, 1982లో ‘జస్టిస్ చౌదరి’ సినిమాలలో తండ్రీకొడుకులుగా రామారావు అలరించిన తీరు అనితరసాధ్యం అనిపించక మానదు.
ఇక జూనియర్ విషయానికి వస్తే – ఆయన తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ‘ఆంధ్రావాలా’ ఆట్టే ఆకట్టుకోలేక పోయింది. ఆ పై ‘అదుర్స్’లో అన్నదమ్ములుగా అదరహో అనిపించారు. ఆ సినిమా కూడా ఓపెనింగ్స్ లో భలేగా సాగి, ఆ తరువాత మెత్తబడింది. ఆ పై ‘శక్తి’లోనూ ద్విపాత్రాభినయమే, తరువాత ‘జై లవకుశ’లో త్రిపాత్రాభినయమూ చేశారు. ఈ నాలుగు చిత్రాలు జూనియర్ యన్టీఆర్ కు నటునిగా మంచి పేరు సంపాదించాయే కానీ, బ్లాక్ బస్టర్స్ గా నిలువలేకపోయాయి. చిత్రమేమిటంటే “ఆంధ్రావాలా, శక్తి” చిత్రాల్లో జూనియర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అవి అంతగా అలరించలేక పోయాయి. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యంగ్ టైగర్ తాజా చిత్రంలో మరోమారు తండ్రీకొడుకులుగా కనిపించనుండటంతోనే అనుమానాలు మొదలయ్యాయి. మరి తండ్రీకొడుకులుగా డ్యుయల్ రోల్ లో కనిపించిన రెండు సార్లు యంగ్ టైగర్ మ్యాజిక్ చేయలేకపోయారు. దాంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
Also Read
ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలిన నటరత్న నటవారసునిగా అడుగుపెట్టిన బాలకృష్ణ సైతం ఆరంభంలో ద్విపాత్రాభినయాలతో అంతగా ఆకట్టుకోలేకపోయారు. తరువాత ఆయన నటించిన “సింహా, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి” వంటి చిత్రాలు అనూహ్య విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకోలేక పోయినా, ‘బాబాయ్ కి తగ్గ అబ్బాయ్’ అనిపించుకుంటారేమో చూడాలి!
తాజావార్తలు
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
-
Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?