తమిళనాడు రాష్ట్రంలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్టూడియోకు మంగళవారం బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ మెయిల్‌లో స్టూడియోలో పేలుడు పరికరం అమర్చబడ్డట్టు పేర్కొన్నారు.
Also Read : Akshay Kumar : డబ్బు, ఫేమ్, సక్సెస్ సెకండరీ.. మనశ్శాంతే ఫస్ట్
చెన్నై, టీ నగర్ లోని స్టూడియోకు వచ్చిన మెయిల్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) కార్యాలయం అందుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అక్కడికి చేరి సుదూర తనిఖీలు చేపట్టాయి. పరిశీలనలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఈ బెదిరింపును నకిలీ గా తేల్చారు. ఇలాగే, చెన్నైలోని అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్ కార్యాలయాలకు కూడా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు మెయిల్ ద్వారా అందాయి. అన్ని కార్యాలయాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా తమిళనాడులోని పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే చీఫ్, నటుడు విజయ్, నటి త్రిష, నటి నయనతార, BJP ప్రధాన కార్యాలయం, డీజీపీ కార్యాలయం, రాజ్ భవన్‌లు ఉన్నాయి. కాగా పోలీసులు ఎలాంటివి వచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతకు సంబంధించిన అన్ని చర్యలు కొనసాగుతున్నాయి.