Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత భారీ సోషియో-ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాకా’. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఇన్సైడ్ సమాచారం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఫిలిం నగర్ ఇన్సైడ్ వర్గాల టాక్ ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా త్రిపాత్రాభినయంలో అలరించబోతున్నట్లు తెగ ప్రచారం సాగుతోంది. కథలో భాగంగా ఆయన తండ్రి పాత్రతో పాటు ఇద్దరు కొడుకుల పాత్రల్లోనూ కనిపించనున్నారని తెలుస్తోంది. తండ్రి పాత్రను ఎంతో పవర్‌ఫుల్‌గా ఇంటెన్స్ షేడ్స్‌తో తీర్చిదిద్దగా, ఇద్దరు కొడుకుల క్యారెక్టర్లను పూర్తి భిన్నమైన వైవిధ్యభరితమైన మేనరిజమ్స్‌తో డిజైన్ చేసినట్లు వినికిడి.
డైరెక్టర్ అట్లీకి తన సినిమాల్లో కథానాయకులను ద్విపాత్రాభినయం లేదా త్రిపాత్రాభినయంలో చూపించడం అలవాటే. ‘అదిరింది’లో విజజ్, జవాన్ లో షారుక్ డ్యూల్ రోల్స్ లో కనిపించారు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో చేయబోతున్న ఈ విజువల్ వండర్‌లో మూడు విభిన్న గెటప్‌లు, విభిన్న క్యారెక్టరైజేషన్లతో బన్నీ వేరియేషన్స్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తన కెరీర్లో డ్యూయల్ రోల్ లేదా త్రిపాత్రాభినయం చేయని అల్లు అర్జున్‌కు ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త నిజమైతే, బాక్సాఫీస్ వద్ద అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు కోలీవుడ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
- Dharman : రజనీకాంత్ - రామ్ పోతినేని 'ధర్మన్' సంక్రాంతి రిలీజ్?
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!