Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Icon Star Allu Arjun Creates New Record With Pushpa Album

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డు!

Published Date :July 13, 2022 , 7:49 pm
By Subbarao N
Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై ముందు నుంచి అల్లు అర్జున్ పెట్టుకున్న ప్రతీ నమ్మకం నిజం అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డు సాధించింది ‘పుష్ప’. ఇప్పటికే ఈ మూవీ మేనరిజమ్స్ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇప్పుడు పాటలు కూడా అదే స్థాయిలో సంచలనాలు సృష్టించాయి. ‘పుష్ప’ మ్యూజిక్ ఆల్బమ్ 5 బిలియన్ వ్యూస్ సాధించింది. అంటే అక్షరాలా 500 కోట్ల వ్యూస్ అన్నమాట. ఇండియన్ సినిమాలో ఈ ఘనత సాధించిన మొదటి హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘పుష్ప’ ఆల్బమ్ అన్నిచోట్లా అద్భుతాలు చేసింది.

‘పుష్ప’ చిత్రంలోని పాటలను చంద్రబోస్ అద్భుతంగా రాశారు. ‘దాక్కో దాక్కో మేక’, ‘ఏయ్ బిడ్డా’, ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా’ పాటలకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ వచ్చింది. అలాగే సోషల్ మీడియా రీల్స్‌లో శ్రీవల్లి స్టెప్ సృష్టించిన రికార్డులు అద్భుతం. ‘పుష్ప’ సినిమాలోని ప్రతి విషయం కూడా ప్రేక్షకులకు అడిక్షన్‌లా మారిపోయింది. ప్రతి పాటను ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. కాబట్టే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో 500 కోట్ల వ్యూస్ సాధించింది ‘పుష్ప’ మ్యూజిక్ ఆల్బమ్. దీనికి ముందు ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా మ్యూజికల్‌గా సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు ‘పుష్ప’ అదే కంటిన్యూ చేసింది.

ఈ మధ్యే బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ కు పంపిన మెసేజ్ వైరల్ అయ్యింది. సుక్కూను పొగుడుతూ.. ‘పుష్ప’ సినిమాను ఆయన వర్ణించిన తీరు సూపర్! ఈ చిత్రంలోని ప్రతీ సీన్ అద్భుతంగా ఉందని.. అలాటి సినిమా అసలు ఎలా తీసారో కూడా అంతుచిక్కడం లేదంటూ సుకుమార్‌ను ఆకాశానికి ఎత్తేశాడు రాజ్ కుమార్ హిరాణి. ఈ విషయాన్ని కూడా బన్నీ ముందుగానే అంచనా వేశారు. సినిమాకు మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినపుడు కూడా ఫలితంపై నమ్మకంగానే ఉన్నారు అల్లు అర్జున్. కచ్చితంగా ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ‘పుష్ప’ 350 కోట్లు వసూలు చేసిందని ఇవాళ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిత్రం ఏమంటే.. రాజకీయ నాయకులు సైతం ‘పుష్ప’ మేనరిజమ్స్ వాడుకుంటూనే ఉన్నారు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • Pushpa
  • Rashmika Mandanna
  • sukumar

తాజావార్తలు

  • Off The Record : బీఆర్ఎస్ వెంటే ఉండాలని మహిపాల్ రెడ్డి డిసైడ్ అయ్యారా?

  • RR vs CSK : రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. వైభవ్ సూర్యవంశీ ‘సిక్సర్ల’ సునామీ.!

  • Gas Cylinder Scam : కొరత పేరుతో కుంభకోణం.. శ్మశానంలోనే సిలిండర్ సీక్రెట్.!

  • Big Relief: యుద్ధం వేళ కేంద్రం బిగ్ రిలీఫ్.. 6 నెలల పాటు EMI కట్టక్కర్లేదు..?!

  • Off The Record: ఆళ్లగడ్డ అడ్డాలో బస్తీ మే సవాల్.. సుబ్బారెడ్డి, అఖిల ప్రియ మధ్య రచ్చ

ట్రెండింగ్‌

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions