అల్లుఅర్జున్, బోయపాటి శ్రీను కలయికలో 5 సంవత్సరాల క్రితం ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. మళ్ళీ వీరద్దరి కలయికలో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని అల్లు అరవింద్ పలు వేదికల్లో స్పష్టం చేశాడు కూడా. బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అది పూర్తి కాగానే దిల్ రాజు, వేణుశ్రీరామ్ తో ‘ఐకాన్’ ఉంటుందని వినిపించింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితం అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఎందుకో ఏమో సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఒకనొక సందర్భంలో ఆగిపోయిందని కూడా వినిపించింది. కానీ ‘వకీల్ సాబ్’ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా ‘ఐకాన్’ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది.
Read also : మరో మైలు రాయిని దాటిన “సర్కారు వారి పాట” బ్లాస్టర్
ఈసారి పక్కగా సెట్స్ మీదకు వెళుతుందని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం బన్నీ బోయపాటితో సినిమా చేయటానికి అనువుగా ‘ఐకాన్’ను పక్కన పెట్టినట్లు టాక్. అల్లు అర్జున్ ‘పుష్ప’ పార్ట్ 1 ది రైజ్ షూటింగ్ ఈ నెలాఖరుతో కానీ వచ్చే నెలలో కానీ పూర్తి కానుంది. ఆ తర్వాత పుష్ప పార్ట్ 2 కి ముందు బన్నీ మరో సినిమా చేయాలనుకుంటున్నాడట. అందులో భాగంగా బోయపాటి ప్రాజెక్ట్ ఉంటుందని సమాచారం. బోయపాటి కూడా బాలయ్యతో తీసిన ‘అఖండ’ను ఈ సంవత్సరాంతంలో విడుదల చేసి ఆ తర్వాత బన్నీ ప్రాజెక్ట్ పై దృష్టి పెడతాడట. మరి ‘ఐకాన్’కి మోక్షం ఎప్పుడో!?