సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణను కొనసాగిస్తున్నారు. గత రెండు రోజులుగా పోలీసులు రవిని విచారిస్తున్నారు. రెండో రోజు విచారణలో భాగంగా ఆరు గంటలకు పైగా ప్రశ్నించగా, పోలీసులు పలు కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఒకవైపు పోలీసులు తమ విచారణను వేగవంతం చేస్తుండగా, మరోవైపు అనూహ్యంగా సోషల్ మీడియాలో నిందితుడు రవికి సాధారణ ప్రజల నుంచి, నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. సినీ పరిశ్రమకు నష్టం చేకూర్చే పైరసీని ప్రోత్సహించినప్పటికీ, సామాన్య జనం రవిని కొనియాడుతున్నారు.
Also Read :NTR-Neel: మళ్లీ మారిన డ్రాగన్?.. ఈసారి ఊర మాస్ కటౌట్!
సినిమా థియేటర్లలో టికెట్ రేట్లు వేలకు వేలు పెరిగిన ప్రస్తుత తరుణంలో, సినిమా చూడాలని ఆశపడే సామాన్యుడి చెంతకు రవి కొత్త సినిమాలను ఉచితంగా తీసుకొచ్చాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.ఈ రోజుల్లో వినోదం ఖరీదైన వ్యవహారంగా మారినప్పుడు, ఐబొమ్మ తమకు ఒక ఉచిత వేదికగా ఉపయోగపడిందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. రవికి మద్దతుగా వేలాది మంది నెటిజన్లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోస్టులు, వీడియోలు షేర్ చేస్తూ, తమ కృతజ్ఞతను తెలియజేస్తున్నారు. కొందరైతే అతన్ని ‘హీరో’గా అభివర్ణిస్తున్నారు.
Also Read :Anchor Shivajyothi : తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు.. వివాదంలో శివజ్యోతి
సామాన్య ప్రజలు, నెటిజన్లు ఐబొమ్మ రవికి మద్దతు తెలుపుతూ ‘హీరో’ ఇమేజ్ ఇవ్వడంపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తీవ్రంగా స్పందించారు. ఒక సినిమా ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవిని హీరోగా చూడటాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని బన్నీ వాసు స్పష్టం చేశారు. అతనికి ఇంత భారీ ఎలివేషన్ ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పైరసీకి మద్దతుగా మాట్లాడటం చట్టవిరుద్ధమని, ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సమాజానికి ఏ మాత్రం మంచిది కాదని ఆయన నొక్కి చెప్పారు. రవి చేసిన పని వల్ల సినీ పరిశ్రమకు రూ. కోట్ల నష్టం వచ్చిందని, దీనిని విస్మరించకూడదని నిర్మాత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో రవిని దేవుడిగానో, హీరోగానో చూడొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.