సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణను కొనసాగిస్తున్నారు. గత రెండు రోజులుగా పోలీసులు రవిని విచారిస్తున్నారు. రెండో రోజు విచారణలో భాగంగా ఆరు గంటలకు పైగా ప్రశ్నించగా, పోలీసులు పలు కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఒకవైపు పోలీసులు తమ విచారణను వేగవంతం చేస్తుండగా, మరోవైపు అనూహ్యంగా సోషల్ మీడియాలో నిందితుడు రవికి సాధారణ ప్రజల నుంచి, నెటిజన్ల నుంచి భారీ…