Colours Swathi: విడాకులయ్యాయో లేదో చెప్పాలన్న రిపోర్టర్.. షాకిచ్చిన కలర్స్ స్వాతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Colours Swathi response on divorce rumors: పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి స్వాతి రెడ్డి తెలుగు బుల్లితెరపై చేసిన టాక్ షో ‘కలర్స్’ పేరునే ఇంటి పేరుగా మార్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు కూడా అందుకుని వెండితెరపైనా సత్తా చాటారు. తర్వాత పెళ్లి చేసుకుని విదేశాలకి వెళ్లిపోయిన ఆమె సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ‘కలర్స్’ స్వాతి వివాహం 2018లో వికాస్ వాసు అనే కేరళకు చెందిన పైలట్ తో జరిగింది. వివాహమై విదేశాలకి వెళ్ళాక… రెండు మూడుసార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చిన ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నారని, అందువల్ల మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమా విడుదల కానుంది. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాలో నవీన్ చంద్రకు జోడీగా ఆమె నటించారు. ఈ రోజు సినిమా ట్రైలర్ ను సాయి ధరమ్ తేజ్ విడుదల చేశారు.
Kodali Nani: చంద్రబాబు అరెస్టైతే లోకేష్ తిరునాళ్లల్లో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు
Also Read
- Hero - Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
- Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
- Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
- Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
ఈ సందర్భంగా సినిమా యూనిట్ నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ కార్యక్రమంలో విడాకులకు సంబంధించిన ప్రశ్న స్వాతికి ఎదురైంది. అయితే ఆమె తెలివిగా ”ఈ కార్యక్రమానికి, ఆ ప్రశ్నకు సంబంధం లేదు, అది అనవసరం అని నా అభిప్రాయం అందుకే నేను సమాధానం చెప్పను” అని స్వాతి స్పందించారు. నవీన్ చంద్ర హీరోగా ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాను శ్రీకాంత్ నాగోటి దర్శకత్వంలో క్రిష్వి ప్రొడక్షన్స్, హ్యండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానర్స్‌పై యశ్వంత్ ములుకుట్ల ఈ నిర్మిస్తున్నారు. ఒక విషయాన్ని జనం ఏ కోణంలో చూస్తున్నారనే దానిపైనే ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. కలర్స్ స్వాతి గృహిణి పాత్రలో నటించగా విపరీతమైన భావోద్వేగాలున్న తాగుబోతు భర్త పాత్రలో నవీన్ చంద్ర కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రేయా నవేలీ, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటించగా అచ్చు రాజమణి సంగీతాన్ని అందించారు.
తాజావార్తలు
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?