Rashi Khanna : సౌత్ లో బాడీ షేమింగ్… గ్యాస్ ట్యాంకర్ అన్నారు !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashi Khanna ప్రస్తుతం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్’లో అలియా పాత్రలో కన్పించి మెప్పించింది. చాలా రోజుల తరువాత బాలీవుడ్ లో ‘రుద్ర’తో అందుకున్న విజయాన్ని ఆస్వాదిస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాశి సౌత్ లో బాడీ షేమింగ్ ఎదురైందని వెల్లడించింది. బొద్దుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రాశీ ఖన్నా బాడీ షేమింగ్‌తో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. రాశి తెలుగుతో పాటు మలయాళం, తమిళ చిత్రాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే అధిక బరువు ఉన్నందుకు దక్షిణాది ప్రజలు తనను ‘గ్యాస్ ట్యాంకర్’ అని పిలిచేవారని గుర్తు చేసుకుంది. వాళ్ళు అలా పిలిచినప్పటికీ తాను పట్టించుకోలేదని, అలాగే తాను ఇప్పుడు ఫిట్ గా మారింది వాళ్ళ కోసం కాదని, తన సినీ కెరీర్ కోసమని వెల్లడించింది.
Read Also : Samantha : ఎట్టకేలకు చైని ఫాలో చేయడం ఆపేసిన బ్యూటీ
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ఈ క్రమంలో పిసిఒడితో పోరాడినట్టు కూడా వెల్లడించింది. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. పైగా కేవలం వారు తెరపై మాత్రమే తనను చూస్తారు. కాబట్టి ఎవరిని నిందించలేమని చెప్పుకొచ్చింది రాశి ఖన్నా. ఇక ఆన్లైన్లో, వ్యక్తిగతంగా ఎదురైన బెదిరింపులు తనను బాధించలేదని రాశి చెప్పింది. ఇదిలా ఉంటే రాశి ఖన్నా ప్రస్తుతం కార్తీ నటించిన తమిళ చిత్రం ‘సర్దార్’లో కనిపించనుంది. ఆమె బాలీవుడ్లో ‘యోధా’, టాలీవుడ్ లో నాగ చైతన్యతో కలిసి ‘థ్యాంక్యూ’ సినిమాలో నటిస్తోంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!