తీసిన కొన్ని సినిమాలు అయినా కొంత మంది హీరోయిన్లు వారి అందం.. అనుకువ తో ప్రేక్షకులను కట్టిపడేసారు. ఇలాంటి హీరోయిన్‌లలో అన్షు ఒకరు.‘మన్మధుడు’ మూవీతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈ మూవీ అన్షుకి తిరుగులేని ఫేమ్‌ని సంపాధించి పెట్టింది. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ‘మజాకా’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎ కె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.ఈ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అన్షు ప్రెస్ మీట్ లో పాల్గొని తనకు సంబంధించిన చాలా విషయాలు పంచుకుంది.
రీ ఎంట్రీ ఇచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది..? అని ప్రశ్నించగా అన్షు మాట్లాడుతూ ‘ మీరు నమ్ముతారో లేదో నేను 15 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. అప్పటికి నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు. ఒకవేళ ‘మన్మధుడు’ మూవీ నా 25 ఏళ్ల వయసులో చేసి ఉంటే.. ఇప్పటికి సినిమాల్లోనే కొనసాగే దాని. కానీ అప్పటికే నా చదువు కూడా పూర్తి కాలేదు. రెండు మూడు సినిమాలు తీసి లండన్ వెళ్ళిపోయాను. కాలేజ్ పూర్తి చేసి మాస్టర్స్ చేశాను. సైకాలజిస్ట్ అయ్యాను. సొంతంగా క్లినిక్ పెట్టాను. 24 ఏళ్లకే పెళ్లి అయ్యింది. నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు. ఇది నా బ్యూటీఫుల్ జర్నీ. ఇక ఈ రీ ఎంట్రీ గురించి చెప్పాలి అంటే.. అసలు ఊహించలేదు. ముందు నాకు ‘మజాకా’ స్టోరీ చెప్పగానే చాలా నచ్చింది.నా క్యారెక్టర్‌కు ఇందులో ఇంపార్టెన్స్ ఉంది. చాలా హెవీ రోల్.. అందుకే ఓకే చేశాను. 23 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ తెరపై కనిపిస్తున్న ఈ సినిమా కచ్చితంగా అందరినీ అలరిస్తుందని, నా పెర్ఫార్మెన్స్‌ని అందరూ ఇష్టపడతారని నమ్ముతున్నాను. ఇక షూటింగ్.. లైటింగ్ అవ్వని కొంచెం కొత్తగా అనిపించింది. మొదటి రోజు చాలా నెర్వస్ ఫీలయ్యాను. స్కూల్ కి న్యూ కమ్మర్ లానే అనిపించింది. కానీ మా టీం లో అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. రెండు రోజుల్లో అంతా సెట్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చింది.