Huge Release for Sri Sri Sri Raja Vaaru: రీసెంట్ గా ఆయ్ అంటూ , గతంలో మ్యాడ్ అంటూ యూత్ ని ఎంటర్ టైన్ చేస్తూ,హిట్ మీద హిట్టు తో దూసుకుపోతున్న నార్నె నితిన్ మరోసారి దసరాకి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. సినీ పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు.. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ సినిమాలో నటిస్తున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు.
Vinayakan Arrested: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో జైలర్ విలన్ అరెస్ట్?
అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అత్యధిక థియేటర్లలో ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ… ‘ముందుగా మమ్మల్ని మా బ్యానర్ ని ఆదరిస్తున్న అఖిలాంధ్ర ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు.మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇక శ్రీ శ్రీ రాజావారు విషయానికొస్తే మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతో తెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న. ఎన్టీఆర్ ఎంతో మెచ్చి… ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ దసరాకి నార్నె నితిన్ ఖాతాలో ఆయ్ , మ్యాడ్ తరహాలో హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం. అని అన్నారు.