Hrithik Roshan: నీకోసం యుద్ధభూమిలో వేచి చూస్తున్న తారక్.. రా చూసుకుందాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hrithik Roshan Wishes NTR Birthday In A Unique Way: ఈరోజు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే.. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు సినీ ప్రియులు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే.. బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ మాత్రం అందరికంటే భిన్నంగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. తారక్‌కి బర్త్‌డే విషెస్ తెలియచేస్తూనే, నీకోసం యుద్ధభూమిలో వేచి చూస్తున్నానంటూ పరోక్షంగా ‘వార్ 2’ సినిమాపై అప్డేట్ ఇచ్చేశాడు. ఆ ట్వీట్ చివర్లో తెలుగులో ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా’ అంటూ తెలుగులో టచ్ కూడా ఇచ్చాడు. ‘హ్యాపీ బర్త్ డే తారక్. ఈ సంతోషకరమైన రోజుని నువ్వు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. నీకోసం నేను యుద్ధభూమిలో వేచి చూస్తున్నాను. మనం కలిసేంత వరకు నీ ప్రతిరోజూ శాంతియుతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా’’ అంటూ ట్వీట్ చేశాడు. దీన్ని బట్టి.. వీళ్లిద్దరు కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారని మరోసారి అనధికారికంగానే కన్ఫమ్ అయ్యింది.
Toor dal rates hiked: కదంతొక్కిన కందిపప్పు.. రూ. 140 నుంచి రూ.180 పెరిగే ఛాన్స్..!
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇంతకుముందు వచ్చిన ‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఆ సినిమా అప్పట్లో కలెక్షన్ల సునామీ సృష్టించి, బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. అయితే.. సీక్వెల్‌కి మాత్రం దర్శకుడు మారాడు. ‘బ్రహ్మాస్త్ర’ను తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ని రూపొందించనున్నాడు. యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపుదాల్చుకుంటోంది. ఇందులో తారక్, హృతిక్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుంది. హృతిక్ కథానాయకుడిగా కొనసాగుతుండగా, తారక్ మాత్రం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం తాము చేస్తున్న ప్రాజెక్టులను ముగించుకున్న తర్వాత.. ‘వార్ 2’ సినిమా సెట్స్‌లోకి తారక్, హృతిక్ చేరనున్నారు. అందుకు కొంత ఎక్కువ సమయమే వేచి ఉండాల్సి ఉంటుంది.
Happy Birthday @tarak9999! Wishing you a joyous day and an action packed year ahead. Awaiting you on the yuddhabhumi my friend. May your days be full of happiness and peace
…until we meet 😉
Puttina Roju Subhakankshalu Mitrama 🙏🏻
— Hrithik Roshan (@iHrithik) May 20, 2023
Simhadri 4K: ఫాన్స్ తో సింహాద్రి చూసి ఫుల్ ఎంజాయ్ చేసిన జక్కన ఫ్యామిలీ
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!