మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా నందమూరి ఫాన్స్ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయిన సింహాద్రి సినిమాని రీరిలీజ్ చేసిన ఫాన్స్, థియేటర్స్ లో రచ్చ చేస్తున్నారు. ఒక రీరిలీజ్ సినిమా 1140 థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైమ్. ఈ రేంజ్ హంగామా చేస్తున్న ఫాన్స్ రీరిలీజ్ హిస్టరీలోనే కొత్త రికార్డులు క్రియేట్ చెయ్యడానికి రెడీ అయ్యారు. అమలాపురం నుంచి అమెరికా వరకు అన్ని సెంటర్స్ లో సింహాద్రి రీరిలీజ్ కి హౌజ్ ఫుల్ బోర్డ్స్ పెట్టేసారు. క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 70MM థియేటర్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో కలిసి సింహాద్రి రీరిలీజ్ ని ఎంజాయ్ చేసారు రాజమౌళి ఫ్యామిలీ. రమా రాజమౌళి, వల్లి గారు, కార్తికేయ, కాలభైరవ ఫ్యామిలీతో పాటు వచ్చి సింహాద్రి సినిమాని అభిమానులతో కలిసి చూసారు.
Read Also: Koratala Shiva: ఎన్టీఆర్ ఒక్కడే నిలబడ్డాడు… ఆ నమ్మకం రిజల్ట్ ‘దేవర’ పోస్టర్
సింహాద్రి సినిమా ఎన్టీఆర్-రాజమౌళిల కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా. రాజమౌళి-ఎన్టీఆర్ ల రేంజ్ పెంచిన సినిమా అని కూడా చెప్పొచ్చు. ఈ మూవీలో ఎన్టీఆర్ ని ‘సింగమలై’గా జక్కన ఏ రేంజులో చూపించాడో 20 ఏళ్ల తర్వాత కూడా గ్రాండ్ గా జరుగుతున్న సెలబ్రేషన్స్ ని చూస్తే అర్ధమవుతుంది. ఇండియా, యూకే, యూఎస్, ఆస్ట్రేలియాల్లోనే కాదు జపాన్ లో కూడా సింహాద్రి రీరిలీజ్ అయ్యింది, అక్కడి ఫాన్స్ ప్రీబుకింగ్స్ తోనే 1 మిలియన్ ఎన్ లో ఇచ్చేసారు. ఓవరాల్ గా సింహాద్రి రీరిలీజ్ కలెక్షన్స్ ఇండియాలో ఇకపై రీరిలీజ్ అవ్వబోయే సినిమాలకి ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చెయ్యడం అయితే గ్యారెంటీగానే కనిపిస్తోంది.