ప్రేమకథలకు చిత్రసీమలో తిరుగులేదు అంటూ ఉంటారు. లవ్ స్టోరీస్ లో కాసింత కొత్తదనం కనిపించినా జనానికి ఎక్కేస్తుందనీ సినీజనం చెబుతుంటారు. పరిశీలించి చూస్తే మన చుట్టూనే బోలెడు వరైటీ లవ్ స్టోరీస్ దొరుకుతాయనీ అంటారు. బాలీవుడ్ జనం పరిశీలిస్తున్నారో లేదో కానీ, వాళ్ళ సినీజనాల్లోనే ఓ విచిత్రప్రేమ కథ సాగుతోంది. అందులో నాయకానాయికలు ఎవరంటే హృతిక్ రోషన్, అతని మాజీ భార్య సుజానే ఖాన్ అనే చెప్పాలి. వీరిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 14 ఏళ్ళు కాపురం చేశారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయినా విడిపోయారు. ఆ పై కూడా హృతిక్, సుజానే పిల్లల కోసం కలసి తిరుగుతూనే ఉన్నారు. అందులో తప్పేమీ లేదు. కానీ, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. హృతిక్ తన మనసు దోచిన సబా ఆజాద్ తోనూ, సుజానే తనకు నచ్చిన యంగ్ హీరో అర్సలాన్ గోనీతోనూ చక్కర్లు కొడుతున్నారు. అందులోనూ వింతేమీ లేదంటారా? హృతిక్, సుజానే కలసి తమకు ఇష్టమైన వారిని వెంటేసుకొని పక్కపక్కనే తిరగడమే ఇక్కడ అసలైన ట్విస్ట్!
Read Also : HBD Allu Arjun : రూల్ చేయడానికి ‘పుష్ప’ రెడీ… కానీ ప్లాన్ చేంజ్
హృతిక్, సబాతో కలసి తిరగడమే బాలీవుడ్ జనం వింతగా చర్చించుకున్నారు. మరి ఇప్పుడు ఈ మాజీ దంపతులు తమ నవప్రేమికులతో కలసి ఎంజాయ్ చేయడాన్ని ఏమంటారో? ఈ రెండు జంటలు ఇటీవల గోవాలో చక్కర్లు కొట్టడమే కాదు, ‘ప్రేమించుకుందాం… ఎవరేమన్న ఏమైన కానీ…” అంటూ తాము కలసి ఉన్న పిక్స్ ను పోస్ట్ చేసి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకంటే లవ్ స్టోరీస్ లో వరైటీ కావాలటండీ!? మరి ఈ వైవిధ్యమైన, విలక్షణమైన ప్రేమకథను ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి!