సినీ పరిశ్రమలో ఉన్న నటీనటుల గురించే కాదు వాళ్ళు తీసుకునే భారీ పారితోషికం కూడా హాట్ టాపిక్కే ! అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న కొంతమంది హీరోయిన్లు ఒక సినిమాకు ఎంత వసూలు చేస్తున్నారనే విషయం గురించి తెలుసుకుందాం. నేషనల్ వెబ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం హీరోయిన్లు కొంతమంది కోట్లలో వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే పరిధులు దాటి చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా టాలీవుడ్ లో నటించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది బాలీవుడ్ హీరోయిన్ల రెమ్యూనరేషన్.
Read Also : Valimai : అజిత్ సినిమాకు లెంగ్తీ రన్ టైమ్
దీపికా పదుకొణె పఠాన్, గెహ్రైయాన్ రెండింటిలోనూ భాగం కావడానికి రూ. 15 కోట్లు, డార్లింగ్స్ కోసం అలియా భట్ రూ. 15 కోట్లు వసూలు చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి’తో పాటు కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’లో కూడా భాగం కావడానికి అలియా తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. ‘జీ లే జరా’ కోసం కత్రినా కైఫ్ దాదాపు రూ. 12 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ ఉన్నారు. వారిద్దరూ బాలీవుడ్‌లో తమ పనిని తగ్గించుకున్నారు. ప్రియాంక చోప్రా ‘జీ లే జరా’ కోసం 10 కోట్ల రేంజ్‌లో అందుకుంది. అయితే ‘స్కై ఈజ్ పింక్’కి 8 కోట్ల రూపాయలకు సంతకం చేసింది. ఇక కంగనా ఒక్కో సినిమాకు 21 నుంచి 25 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని వినికిడి. కానీ ఆమె పారితోషికం 8 నుంచి 9 కోట్ల రేంజ్‌లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
శ్రద్ధా కపూర్ రూ.7 కోట్లు వసూలు చేస్తోంది. తాప్సీ పన్ను ‘లూప్ లాపేట’ కోసం రూ. 5 కోట్లు అందుకుంది. అయితే విద్యాబాలన్ గత కొన్నేళ్లుగా తన సినిమాలన్నింటికీ రూ.4 కోట్లు వసూలు చేస్తుంటే… కృతి సనన్ కూడా అదే బాటలో నడుస్తోంది. కియారా అద్వానీ రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ‘జగ్ జగ్ జీయో’ను రూ. 2.50 కోట్లకు ఓకే చేయగా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ ప్రతి చిత్రానికి రూ. 2.00 నుంచి 2.50 కోట్లు అందుకుంటున్నారు. అయితే జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ కూడా రూ. 2 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటుండగా, మరోవైపు అనన్య పాండే రూ.1.50 కోట్లు వసూలు చేస్తోంది. ఏదేమైనా హీరోల రెమ్యూనరేషన్ తో పోలిస్తే హీరోయిన్లకు తక్కువగానే అందుతుందని చెప్పాలి.
