“కేజీఎఫ్ : చాప్టర్ 2” ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. అయితే “కేజీఎఫ్ : చాప్టర్ 2” నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ మరో అడుగు ముందుకేసి, క్రికెట్ టీం ఆర్సీబీతో టీం అప్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఒకవైపు కేజీఎఫ్ : చాప్టర్ 2 మేనియా, మరోవైపు ఐపీఎల్ మేనియా… రెండూ కలిసి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్లు జరుగుతున్నాయి. అయితే తాజాగా హోంబలే ఫిలిమ్స్ నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పగా, ఆర్సీబీ కూడా ప్రభాస్ గురించి స్పెషల్ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
Read Also : Pranitha Subhash: తల్లికాబోతున్న హీరోయిన్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్స్టా స్టోరీస్ లో సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ “KGF 2” చిత్రబృందానికి విషెస్ అందించారు. అలాగే కేజీఎఫ్ : చాప్టర్ 2 టీమ్ ఆర్సీబీతో చేతులు కలిపిన వీడియోను షేర్ చేస్తూ ఆ సర్ప్రైజ్ కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు. ఈ పోస్ట్ ను ట్యాగ్ చేస్తూ హోంబలే ఫిలిమ్స్ ప్రభాస్ కి థ్యాంక్స్ చెప్పింది. ఇక ఆర్సీబీ సైతం “త్వరలో RCB మ్యాచ్‌లో మిమ్మల్ని స్వాగతించాలని మేము ఎదురుచూస్తున్నాము ప్రభాస్! మీ చిత్రాలలో #PlayBold ని కొనసాగించండి. మీ సపోర్ట్ కు ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేశారు. ఇంకేముంది RCB అసలు ప్లాన్ రివీల్ చేయడంతో మ్యాచ్‌లో ప్రభాస్ ను చూడడానికి రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
We look forward to welcoming you at an RCB match soon, Prabhas! Continue to #PlayBold in your films and thank you for your support. 👊🏼 https://t.co/VwEvhTnXAk
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 11, 2022
