Hunt: సుధీర్ బాబు హీరోగా వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘హంట్’. దీనికి మహేష్ దర్శకుడు. పోలీస్ డిపార్ట్ మెంట్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘హంట్’ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి అయిన దీనికి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయడం విశేషం. ఈ విశేషాలను నిర్మాత ఆనంద ప్రసాద్ తెలియచేస్తూ, “హాలీవుడ్‌లో రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ చాలా సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు వస్తున్న ‘జాన్ వీక్ 4’కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. మా సినిమాలో వాళ్ళ ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం. ఆల్రెడీ విడుదలైన టీజర్, ‘పాపతో పైలం…’ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అవి యూ-ట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి” అని అన్నారు.
‘హంట్’ మూవీలో సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, ‘జెమినీ’ సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.