Highcourt good news to hero Navdeep: డ్రగ్స్ కేసులో మరోసారి హీరో నవదీప్ పేరు తెర మీదకు రావడం హాట్ టాపిక్ అయింది. డ్రగ్స్ కేసులో ఇటీవల పట్టుబడిన సినీ ఫైనాన్షియర్ కె వెంకటరత్నారెడ్డి, మరో నిందితుడైన కాప భాస్కర్ బాలాజీలను టీఎస్ న్యాబ్ (తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో నైజీరియన్లతో పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారికి సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ముగ్గురు నైజీరియన్లు, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ విఠల్ రావు కుమారుడు దేవరకొండ సురేష్ రావు, సినీ దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి, సినీ పరిశ్రమతో సంబంధాలు ఉన్న రాంచంద్ సహా మరో ఇద్దరిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఈ కేసులో నవదీప్ కు సంబంధం ఉందని, అతని ఫోన్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నాడని సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు.
Shrikanth Iyyangar: ఏంటీ పెళ్లి పిచ్చి.. మొన్న ఆమె, ఇప్పుడీమె?
అయితే ఈ విషయంపై స్పందించిన నవదీప్ ట్వీట్ చేస్తూ జెంటిల్మెన్ అది నేను కాదు, నేను ఇకడే ఉన్నా . ఎక్కడికి పారిపోలేదు.. అసలు దానితో నాకు సబంధం లేదు దయచేసి క్లారిటీ తెచ్చుకోండి అంటూ ట్వీట్ లో రాసుకొచ్చాడు నవదీప్. ఆ తర్వాత ఎన్టీవీతో కూడా మాట్లాడిన నవదీప్.. తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాదులోనే ఉన్నానని, డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. తాను కూడా ప్రెస్ మీట్ చూశానని కమిషనర్ హీరో నవదీప్ అని ఎక్కడా మెన్షన్ చేయలేదని, అతను వేరే నవదీప్ అయి ఉంటాడని పేర్కొన్నా పోలీసులు ఆయనకు ఈరోజు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. అయితే డగ్స్ కేసుతో తనకు సంబంధంలేదని.. ఈ కేసులో తనను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు నవదీప్. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేయడంతో డ్రగ్స్ కేసులో నవదీప్‌కు భారీ ఊరట లభించింది.