Hidimbha Trailer: అమ్మాయిలను అతికిరాతకంగా చంపుతున్న ‘హిడింబ’ ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hidimbha Trailer: స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడుగా రాజు గారి గది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అశ్విన్ బాబు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా అశ్విన్ కు మంచి పేరునే తీసుకొచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా తరువాత అశ్విన్ మరో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు కానీ, అది జరగడం లేదు. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని కసితో ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ మధ్యకాలంలో అయితే హర్రర్ .. లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువగా హిట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అశ్విన్, నందితా శ్వేత జంటగా నటిస్తున్న చిత్రం హిడింబ. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా హిడింబ ట్రైలర్ ను మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.
NTR: ఆ నవ్వు చాలు సామీ.. బతికేస్తాం
Also Read
- Ajith-MS Dhoni: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు 'తలా'లు.. మధ్యలో సూపర్ స్టార్.. పిక్స్ అదిరిపోలా!
- Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
- Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
- Bheems: భోగి సినిమా హిట్ కాకపోతే నా పేరు మార్చుకుంటా.. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంచలన శపథం!
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. 1908, బంగాళాఖాతం సముద్ర తీరంలో కొంతమందిని బంధించి అక్కడ వదిలేసినట్లు చూపించే షాట్ తో ట్రైలర్ మొదలయ్యింది. ఇక ప్రస్తుత కాలంలో వరుసగా 26 మంది అమ్మాయిల మిస్సింగ్ కేసు అంటూ న్యూస్ రావడంతో కథ మొదలవుతుంది. వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి అతి దారుణంగా హత్యచేసే సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్స్ అయిన అశ్విన్, నందితా ప్రయత్నిస్తూ ఉంటారు. కేవలం రెడ్ డ్రెస్ వేసుకున్నవారినే కిడ్నాపర్ టార్గెట్ చేయడంతో వీరు కొంతమంది అమ్మాయిలకు రెడ్ డ్రెస్ వేసి ఆపరేషన్ మొదలుపెడతారు. అయితే ఆ ఆపరేషన్ ఫెయిల్ అవ్వడంతో పై అధికారులు ఈ జంటఐ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న అశ్విన్, నందిత.. బాగా రీసెర్చ్ చేసి ఒక నాలుగు కొమ్ముల చెక్క మాస్క్ ను కనిపెడతారు.అసలు ఆ మాస్క్ ఎవరిది..? ఆ మాస్క్ కు హిడింబకు సంబంధం ఏంటి..? బంగాళాఖాతంలో చనిపోయిన ఆ బందీలు ఎవరు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక అశ్విన్ బందీగా, పోలీస్ గా డబుల్ రోల్ లో కనిపిస్తున్నాడు. నందితాతో లిప్ కిస్, రొమాన్స్ కూడా చూపించి హైప్ పెంచారు. వికాస్ బడిశా సంగీతం గ్రిప్పింగ్ గా ఉంది. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి హిడింబతో అశ్విన్ హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.
తాజావార్తలు
-
INDA vs PAKA: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Koti Deepotsavam 2026: గరికిపాటి ప్రవచనం, ఏకామ్రేశ్వరస్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
-
Ajith-MS Dhoni: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు ‘తలా’లు.. మధ్యలో సూపర్ స్టార్.. పిక్స్ అదిరిపోలా!
-
TTD: తిరుమల భక్తులకు అలర్ట్..
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
ట్రెండింగ్
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..