విజయ్ దేవరకొండనో ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ హీరోగా మార్చిన అర్జున్ రెడ్డి సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ‘షాలిని పాండే’ బాగా నచ్చుతుంది. మెడికల్ స్టూడెంట్ ప్రీతి పాత్రలో షాలిని పాండే బాగా పెర్ఫామ్ చేసింది. ఈ మధ్య ప్రదేశ్ బ్యూటీ అర్జున్ రెడ్డి సినిమాలో కన్నడ అమ్మాయిగా, ట్రెడిషనల్ గా కనిపిస్తూనే రొమాంటిక్ సీన్స్ చేసింది. యూత్ మొదటి సినిమాతోనే ఫిదా చేసిన ఈ బ్యూటీ, ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే అసలు అడ్రెసే లేదు. 2017లో వచ్చిన ర్జున్ రెడ్డి తర్వాత 118, నిశబ్దం సినిమాలు తప్ప షాలిని పాండే చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం చెయ్యలేదు. బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా షాలిని పాండే తన లక్ ని టెస్ట్ చేసుకుంటుంది కానీ ఆశించిన స్థాయిలో పేరు రావట్లేదు. ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన హీరోయిన్, అయిదేళ్లు తిరిగే సరికి కాలి అయిపొయింది అంటే అది షాలిని పాండే మాత్రమే. ప్రస్తుతం ఆమె చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో షాలిని సైన్ చేసిన సినిమాలు కూడా లేవు.
సినిమాలు లేవని తినడం మానేసిందో లేక డైటింగ్ పేరుతో కడుపు కాల్చుకుంటుందో తెలియదు కానీ అర్జున్ రెడ్డి సినిమాలో ముద్దుగా బొద్దుగా ఉన్న షాలిని పాండే ఇప్పుడు పూర్తిగా బక్కచిక్కి పోయి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఫోటోస్ తో యాక్టివ్ గా ఉండే షాలిని పాండే, చాలా రెగ్యులర్ గా కొత్త కొత్త ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈమధ్య కాలంలో షాలిని పాండే పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం… ఈ అమ్మాయి ఏంటి ఇలా అయిపొయింది అనిపించకమానదు. లేటెస్ట్ గా షాలిని పాండే రెడ్ డ్రెస్ లో చేసిన ఫోటోషూట్ నుంచి కొన్ని ఫోటోస్ ని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. వీటిని చూస్తే ఆమె షాలిని పాండే అని చెప్పినా నమ్మడం కష్టమే. షాలిని మోడరన్ గా కనిపిస్తుంది, గ్లామర్ షో కూడా చేస్తుంది కానీ అట్రాక్ట్ చేసే అందం మాత్రం మిస్ అయ్యింది. ఈ ఫోటోస్ చూసిన ఫాన్స్ కూడా ఒకప్పుడే బాగుంటుందే అని కామెంట్స్ పెడుతున్నారు. మరి అర్జున్ రెడ్డి బ్యూటీ ఎందుకు ఇలా అవుతుందో ఆమెకే తెలియాలి.