Karthika: పెళ్లి పీటలు ఎక్కుతున్న దమ్ము హీరోయిన్.. దర్శకేంద్రుడుకు ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthika ఈ ఏడాది చాలమనది సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే శర్వానంద్, వరుణ్ తేజ్, కోలీవుడ్ హీరో అశోక్ సెల్వన్ ఇలా ఒక్కొక్కరిగా పెళ్లిపీటలు ఎక్కారు. ఇక తాజాగా ఈ ఏడాది మరో హీరోయిన్ పెళ్లిపీటలు ఎక్కుతుంది. ఆమె కార్తీక. సీనియర్ నటి రాధ పెద్ద కూతురిగా జోష్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది కార్తీక. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది కానీ, కార్తీకకు మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా తరువాత బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ, దమ్ము లాంటి సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో.. ఎన్టీఆర్ కు మరదలిగా.. బావగారు యూజ్ చేసుకోండి అనే డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత తమిళ హీరో జీవా – పియా బాజ్‌పాయ్‌లతో కలిసి రెండవ చిత్రం రంగంతో పెద్ద విజయం అందుకుంది. ఆ తరువాత కోలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన కార్తీక.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది.
Gayathri Raghuram: అయ్యో.. బాపు బొమ్మ ఏంటీ .. ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది
Also Read
- Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
- Sowcar Janaki Health: సీనియర్ నటి 'షావుకారు' జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స!
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
ఇక ఈ మధ్యనే ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను కార్తీక సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కానీ, ఎక్కడా హబ్బీ ఫోటోను షేర్ చేయలేదు. ఇక పెళ్లి డేట్ దగ్గరపడుతుండటంతో కార్తీక తల్లి రాధ.. పెళ్లి పిలుపులకు బయల్దేరింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వచ్చిన ఆమె.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును కలిసి వెడ్డింగ్ కార్డు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రాధతో కలిసి ఉన్న వీడియోను దర్శకేంద్రుడు షేర్ చేస్తూ..” రాధ.. నిన్ను చాలాయేళ్ల తరువాత కలవడం సంతోషంగా ఉంది. ఇక మీ కూతురు పెళ్లికి నా శుభాకాంక్షలు..” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మరి కార్తీక పెళ్లి తరువాత నటిస్తుందో లేదో చూడాలి.
Glad to see you Radha after so many years.. And Congratulations for your daughter marriage. All the good luck pic.twitter.com/afE2xyuW5i
— Raghavendra Rao K (@Ragavendraraoba) November 8, 2023
తాజావార్తలు
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
-
Gold Price Today: ఒక్కరోజే రూ.4,300 పెరిగిన బంగారం ధర.. వెండి కూడా భగ్గుమంటోంది!
-
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!