Hero Srikanth Denies Divorce Rumours: తను, ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా కొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో అబద్దపు వార్తలు ప్రచారం అవటంపై హీరో శ్రీకాంత్ స్పందించారు. ఈ విషయమై మాట్లాడుతూ ‘అసలు ఇలాంటి పుకార్లను ఎవరు పుట్టిస్తున్నారో అర్థం కావటం లేదు. ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తల వల్ల వారికి ఏం ఉపయోగమో తెలియటం లేదు. గతంలో కూడా నేను చనిపోయినట్లు పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్రమైన ఆందోళనకు గురి చేశారు. తాజాగా ఆర్థిక ఇబ్బందుల కారణాలతో విడాకులు తీసుకుంటున్నాం అంటూ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్‌సైట్స్‌లో ప్రచారంలోకి వచ్చిన ఈ వార్తను స్నేహితులు ఊహకు పంపటంతో తను కంగారుపడింది. వాటిని నమ్మవద్దని తనను ఓదార్చాను’ అని అన్నారు.
‘ఇలా కొన్ని చిల్లర వెబ్సైట్స్, యూట్యూబ్ చానల్స్ చేసిన ఈ పనితో వివరణ ఇవ్వవలసి రావటం న్యూసెన్స్‌గా ఉంది. ప్రస్తుతం ఫ్యామిలీతో చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో ఇలాంటి పుకార్లు చిరాకు తెప్పిస్తున్నాయి. ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం వివరణ ఇస్తున్నాను. నా మీదనే కాదు చాలామంది ప్రముఖుల మీద కూడా ఇలాంటి నిరాధారమైన వార్తలు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ తీవ్రస్థాయిలో ఖండించారు హీరో శ్రీకాంత్.