Trisha: త్రిషకు మెగా కోడలు సర్ప్రైజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉపాసన స్పెషల్ గిఫ్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trisha: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. తెలుగువారి ఇళ్లలో ఆవకాయ పచ్చళ్ల ఘుమఘుమలు మొదలైపోతాయి. ఇప్పుడు అదే ఘుమఘుమలు కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష ఇంటికి చేరాయి. మెగా కోడలు ఉపాసన కొణిదెల నుంచి త్రిషకు ఒక అదిరిపోయే సమ్మర్ సర్ప్రైజ్ అందింది. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంతో నటిస్తున్న త్రిష కృష్ణన్‌కు మెగా ఫ్యామిలీ నుంచి ఒక అదిరిపోయే సమ్మర్ సర్ప్రైజ్ అందింది. మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.. త్రిషకు నోరూరించే ప్రత్యేకమైన గిఫ్ట్ పంపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఉపాసన కొణిదెల నేతృత్వంలో నడుస్తున్న ప్రముఖ హోమ్ ఫుడ్ బ్రాండ్ ‘అత్తమ్మాస్ కిచెన్’ నుంచి హీరోయిన్ త్రిషకు ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ చేరింది. సాంప్రదాయ తెలుగు వంటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ బ్రాండ్ నుంచి పంపిన గిఫ్ట్ బాక్స్‌లో.. వేసవి కాలం స్పెషల్ అయిన నోరూరించే ఘుమఘుమలాడే కొత్త ఆవకాయ పచ్చళ్లతో పాటు వివిధ రకాల పచ్చళ్లు, రుచికరమైన పొడులు ఉన్నాయి. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ టేస్టీ సర్ప్రైజ్ చూసి త్రిష ఫిదా అయిపోయింది. ఆ గిఫ్ట్ బాస్కెట్‌ను ఫోటో తీసి తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఉపాసనకు ట్యాగ్ చేస్తూ.. “ఈ అద్భుతమైన గిఫ్ట్ చూస్తుంటే నాకు నిజంగానే వేసవి కాలం (సమ్మర్) వచ్చేసినట్లు అనిపిస్తోంది. థ్యాంక్యూ సో మచ్ ఉపాసన” అంటూ హార్ట్ ఎమోజీలతో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. త్రిష పెట్టిన ఈ పోస్ట్‌ను ఉపాసన కూడా తన సోషల్ మీడియా ఖాతాలో రీ-షేర్ చేయడంతో, మెగా ఫ్యాన్స్ ఈ పోస్ట్‌లను తెగ వైరల్ చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!