Killer Movie Accident: ఎస్.జె.సూర్య ‘కిల్లర్’ సెట్స్‌లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Killer Movie Accident: తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. చెన్నై షూటింగ్ స్పాట్లో ఘోర ప్రమాదం జరిగింది. వైవిధ్యభరిత నటుడు ఎస్.జె.సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కిల్లర్’ సెట్స్‌లో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అసలేం జరిగిందంటే.. ప్రముఖ నటుడు ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ సినిమా షూటింగ్ స్పాట్లో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నైలోని ప్రసిద్ధ బిన్నీ మిల్స్‌లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
చిత్ర యూనిట్ అందించిన సమాచారం ప్రకారం.. బిన్నీ మిల్స్‌లో మూవీ యూనిట్ గత రాత్రి నుంచి ఒక హై – వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక భారీ ఫైర్ సీన్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ఫైర్ ఎఫెక్ట్స్ కోసం సెట్స్‌కు గ్యాస్ సిలిండర్లను తీసుకువచ్చారు. అయితే ఇందులో ఒక సిలిండర్‌లోకి గ్యాస్ నింపుతున్న సమయంలో ఊహించని విధంగా లీకేజీ ఏర్పడింది. గ్యాస్ వేగంగా లీక్ అవ్వడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద తీవ్రతకు అక్కడ పనిచేస్తున్న ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పక్కనే ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్.. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంతో ‘కిల్లర్’ చిత్ర షూటింగ్‌ను మేకర్స్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?