4 Years of Vikram: లోకనాయకుడి ‘విక్రమ్’ కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
4 Years of Vikram: కమల్ హాసన్ కెరీర్లో మైండ్‌బ్లోయింగ్ కంబ్యాక్ ఫిల్మ్‌గా నిలిచిన యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ రిలీజ్ అయ్యి నేటికి (జూన్ 3) విజయవంతంగా 4 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో #4YearsofVikram హ్యాష్‌ట్యాగ్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఆల్- టైమ్ రికార్డులను తిరగరాసిన ఈ విజువల్ వండర్, లోకేష్ కనగరాజ్ సినీ ప్రపంచంలో (LCU) ఒక సంచలన మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘విక్రమ్’ విడుదలై నేటికి విజయవంతంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నిజానికి ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచింది. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ (RKFI) నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం అందులోని మల్టీస్టారర్ కాస్టింగ్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కమల్ తనదైన నటనతో స్క్రీన్‌పై విశ్వరూపం చూపించగా .. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తమ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ఇక అన్నింటికీ మించి, క్లైమాక్స్‌లో కేవలం 5 నిమిషాల పాటు ‘రోలెక్స్’ పాత్రలో స్టార్ హీరో సూర్య ఇచ్చిన ఎంట్రీ థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించింది.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
‘విక్రమ్’ సాధించిన భారీ విజయంలో రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కీ రోల్ ప్లే చేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. థియేటర్లలో ఆ సౌండ్ ట్రాక్ సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, అన్బరివ్ స్టంట్ కొరియోగ్రఫీ ఈ యాక్షన్ డ్రామాను టెక్నికల్ వండర్‌గా మార్చాయి. నేటికీ చెదరని రికార్డులతో లోకేష్ కనగరాజ్ సినీ యూనివర్స్ (LCU)లో ‘విక్రమ్’ ఎప్పటికీ ఒక అద్భుతమైన లెగసీని కొనసాగిస్తూనే ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!