Jagapathi Babu: ఒకప్పటి స్టార్ హీరో.. రోడ్డుపై అంతలా తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు? వైరల్ అవుతున్న వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagapathi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi). ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు పోషిస్తున్న ‘అప్పలసూరి’ పాత్రకు సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ప్రాణం పెట్టే నటుల్లో జగపతి బాబు ఒకరు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న జగ్గూభాయ్.. తాజాగా చేసిన ఒక సాహసోపేతమైన ప్రయత్నం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో ఆయన ‘అప్పలసూరి’ అనే పవర్ఫుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్యారెక్టర్ గెటప్‌లో ఆయన ఏకంగా హైదరాబాద్ రోడ్లపై సాధారణ ప్రజల మధ్య తిరిగినా.. ఎవరూ గుర్తుపట్టలేకపోయారనే షాకింగ్ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
తాజాగా జగపతి బాబు తన అధికారిక X ఖాతా ద్వారా షేర్ చేసిన ఒక ప్రత్యేక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన బట్టతల క్యాప్, ప్రోస్తెటిక్స్ మేకప్, తెల్లటి గడ్డంతో పూర్తి డీగ్లామరైజ్డ్ లుక్‌లో కనిపించారు. పంచె కట్టుకుని, పక్కా లోకల్ అప్పలసూరి అవతారంలో నగర రహదారులపై సాధారణ వ్యక్తిలా నడుచుకుంటూ వెళ్లారు. పక్కనే వందలాది మంది జనాలు, భారీ ట్రాఫిక్ ఉన్నప్పటికీ.. కళ్లముందున్నది ఒకప్పటి స్టార్ హీరో జగపతి బాబు అని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అంతలా ఆయన ఆ పాత్రలో లీనం అయ్యి, ఆ జనాల్లో సాధారణ మనిషిగా మారిపోయారు. ప్రస్తుతం ఈ మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్ఫార్మేషన్ వీడియోపై సోషల్ మీడియాలో అభిమానులు, సినీ విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read
- Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
- The Traitors Telugu :'చీప్.. మిడిల్ క్లాస్'.. వర్ష'పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
- Killer Movie: ఇంటర్వెల్ ట్విస్ట్ చెబితే ఏకంగా కోటి రూపాయలు: డైరెక్టర్ సంచలన ఛాలెంజ్
- Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
“ఇది కేవలం నటన కాదు.. సినిమాపై ఆయనకున్న తపస్సు” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బుచ్చిబాబు సానా మలిచిన ఈ పాత్ర కోసం జగపతి బాబు పడిన కష్టం, చూపించిన డెడికేషన్ చూస్తుంటే థియేటర్లలో అప్పలసూరి క్యారెక్టర్ ఏ రేంజ్లో విధ్వంసం సృష్టించబోతుందో అర్థమవుతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రేజీ ఎక్స్‌పీరియన్స్‌పై జగపతి బాబు స్పందిస్తూ.. “పాత్రలో పూర్తిగా మునిగిపోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేశాను. ప్రజల మధ్య అంతసేపు తిరిగినా నన్ను ఎవరూ గుర్తించకపోవడం ఒక నటుడిగా నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది” అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘పెద్ది’ విషయానికి వస్తే.. రేపు (జూన్ 4, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదలకి ముందే జగపతి బాబు షేర్ చేసిన ఈ ఒక్క వీడియోతో ‘పెద్ది’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
Appalasoori road na padina kooda yevaru gurthupattaledhu. #Peddi pic.twitter.com/eEDp94SUsO
— Jaggu Bhai (@IamJagguBhai) June 3, 2026
తాజావార్తలు
-
CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!